NTV Telugu Site icon

Commonwealth Games: అమ్మాయిల కీలక పోరు.. నేడు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ టీ20 మ్యాచ్

Ind Vs Pak

Ind Vs Pak

commonwealth games-India vs Pakistan T20match: కామన్వెల్త్ గేమ్స్ లో కీలక పోరు జరగనుంది. తొలిసారిగా కామన్వెల్త్ క్రీడల్లో మహిళా క్రికెట్ మ్యాచులు జరుగుతున్నాయి. దీంతో ఈ సారి సత్తా చాటాలని భారత అమ్మాయిలు భావిస్తున్నారు. ఫస్ట్ మ్యాచులో ఆఖరి వరకు పోరాడినా.. ఆస్ట్రేలియా మ్యాచులో విజయం దక్కలేదు. తాజాగా ఆదివారం రోజు మహిళల విభాగంలో ఇండియా, పాకిస్తాన్ జట్ల మధ్య కీలక పోరు జరగబోతోంది. అటు పాకిస్తాన్ ఉమెన్స్ జట్టు కూడా తన తొలి మ్యాచులో బార్చడోస్ పై ఓడిపోయింది. దీంతో ఇరు జట్లకు ఇది కీలకంగా మారింది. ఇందులో గెలిస్తేనే సెమీస్ బెర్త్ దక్కించుకునే అవకాశం ఉంది. చిరకాల ప్రత్యర్థితో భారత మహిళా క్రికెట్ టీం తలపడుతుండటంతో ఈ మ్యాచ్ ఇంట్రెస్టింగ్ మారింది. ఈ రోజు బర్మింగ్ హామ్ లోని ఎడ్జ్‌బాస్టన్‌లో పాకిస్తాన్ మహిళా జట్టులో తలపడనుంది. ఈ రెండు టీములు తమ తొలి మ్యాచుల్లో ఓడిపోవడంతో..హోరాహోరీగా తలపడే అవకాశం ఉంది.

Read Also: Commonwealth Games: అదరగొట్టిన వెయిట్​లిఫ్టర్లు.. ప్రధాని మోడీ ప్రశంసలు

బర్మింగ్ హామ్ వికెట్ బ్యాటింగ్ కు అనుకూలంగా ఉంది. దీంతో భారీ స్కోర్లు సాధించే అవకాశం ఉంది. రెండు జట్లకు బలమైన బౌలింగ్, బ్యాటింగ్ లైనప్ ఉంది. అయితే టాస్ కీలకంగా మారే అవకాశం ఉంది. టాస్ గెలిచిన జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకునే అవకాశం కనిపిస్తోంది. ప్రత్యర్థి జట్లు నిర్ధేశించిన లక్ష్యాన్ని ఛేజ్ చేయాలని అనుకునే అవకాశం ఉంది. మధ్యాహ్నం 3.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.

జట్ల అంచనా:

భారత మహిళల జట్టు:
స్మృతి మంధాన, షఫాలీ వర్మ, యాస్తికా భాటియా (వికెట్ కీపర్), హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), జెమిమా రోడ్రిగ్స్, హర్లీన్ డియోల్, దీప్తి శర్మ, రాధా యాదవ్, రాజేశ్వరి గయాక్వాడ్, మేఘనా సింగ్, రేణుకా సింగ్ ఠాకూర్

పాకిస్థాన్ మహిళల జట్టు:
మునీబా అలీ (వికెట్ కీపర్), ఇరామ్ జావేద్, బిస్మాహ్ మరూఫ్ (కెప్టెన్), ఒమైమా సోహైల్, నిదా దార్, అలియా రియాజ్, అయేషా నసీమ్, ఫాతిమా సనా, తుబా హసన్, డయానా బేగ్, అనమ్ అమీన్