India Medal Tally: కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ చరిత్ర.. 39 పతకాలతో ఘన ముగింపు.. మెడల్స్ ఫుల్ లిస్ట్ ఇదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Full List of Medals in Commonwealth Games 2026: కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత క్రీడాకారులు అద్భుత ప్రదర్శనతో అదరగొట్టారు. మొత్తం 39 పతకాలతో ఇండియా కామన్వెల్త్ క్రీడలను ఘనంగా ముగించింది. భారత్ ఖాతాలో 13 స్వర్ణాలు, 17 రజతాలు, 9 కాంస్య పతకాలు చేరాయి. ముఖ్యంగా బాక్సింగ్, వెయిట్‌లిఫ్టింగ్, అథ్లెటిక్స్, పారా అథ్లెటిక్స్ విభాగాల్లో భారత ఆటగాళ్లు అసాధారణ ప్రతిభ కనబరిచారు. ఈసారి కామన్వెల్త్ గేమ్స్‌లో భారత బాక్సర్లు ఏకంగా 10 పతకాలు సాధించడం విశేషం. అందులో 7 స్వర్ణాలు, 3 రజత పతకాలు ఉన్నాయి. కామన్వెల్త్ గేమ్స్ చరిత్రలో బాక్సింగ్‌లో భారత్‌కు ఇదే అత్యుత్తమ ప్రదర్శనగా నిలిచింది.
2022 బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ క్రీడల్లో భారత్ 60 పతకాలు సాధించింది. 2026 గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల్లో భారత్‌కు 39 పతకాలు దక్కాయి. 2022లో 60 పతకాలతో భారత్ నాలుగో స్థానంలో నిలిస్తే.. ఈసారి 39 పతకాలతోనే నాలుగో స్థానం దక్కింది. గత క్రీడలతో పోలిస్తే పతకాలు తక్కువే వచ్చినా.. పట్టికలో స్థానం మారలేదు. ఇందుకు కారణం భారత క్రీడాకారుల ప్రతిభ. ఈసారి గ్లాస్గోలో రెజ్లింగ్, బ్యాడ్మింటన్, హాకీ లాంటి క్రీడలను తప్పించిన విషయం తెలిసిందే. అయినా భారత్ బృందం మెరుగైన ప్రదర్శనే చేయగలిగిందంటే కారణం బాక్సర్లే. మన బాక్సర్లు కామన్వెల్త్ క్రీడల చరిత్రలోనే భారత్ తరఫున మెరుగైన ప్రదర్శన చేశారు.
Also Read
- Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
- Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
- Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
- Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
2026 గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల్లో వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత స్టార్ మీరాబాయి చాను మరోసారి చరిత్ర సృష్టించింది. మహిళల 48 కిలోల విభాగంలో స్వర్ణ పతకం సాధించి వరుసగా మూడో కామన్వెల్త్ గేమ్స్‌లో గోల్డ్ మెడల్ గెలిచిన తొలి భారత వెయిట్‌లిఫ్టర్‌గా నిలిచింది. వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత్ మొత్తం 8 పతకాలు సాధించింది. అందులో ఒక స్వర్ణం, ఆరు రజతాలు, ఒక కాంస్య పతకం ఉన్నాయి. రిషికాంత సింగ్, ముత్తుపాండి రాజా, జ్ఞానేశ్వరి యాదవ్, వల్లూరి అజయ్ బాబు, హర్జిందర్ కౌర్, లవ్‌ప్రీత్ సింగ్ రజత పతకాలు సాధించగా.. బింద్యారాణి దేవి కాంస్య పతకాన్ని ఖాతాలో వేసుకుంది.
అథ్లెటిక్స్, పారా అథ్లెటిక్స్‌లో కూడా భారత్ సత్తా చాటింది. మొత్తం 16 పతకాలు సాధించింది. అందులో 3 స్వర్ణాలు, 7 రజతాలు, 6 కాంస్య పతకాలు ఉన్నాయి. గుల్వీర్ సింగ్ పురుషుల 10,000 మీటర్లలో రజతం, 5,000 మీటర్లలో కాంస్యం గెలిచి ఒకే కామన్వెల్త్ గేమ్స్ ఎడిషన్‌లో ట్రాక్ అండ్ ఫీల్డ్ విభాగంలో రెండు పతకాలు సాధించిన తొలి భారత అథ్లెట్‌గా చరిత్ర సృష్టించాడు. అలాగే తేజస్విన్ శంకర్ డెకాథ్లాన్‌లో కాంస్య పతకం సాధించి కామన్వెల్త్ గేమ్స్ చరిత్రలో ఈ విభాగంలో పతకం గెలిచిన తొలి భారత అథ్లెట్‌గా నిలిచాడు. జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా రజతం గెలవగా.. యశ్ వీర్ సింగ్ కాంస్యం సాధించాడు. లాంగ్ జంప్‌లో మురళీ శ్రీశంకర్ రజతం, ట్రిపుల్ జంప్‌లో ప్రవీణ్ చిత్రవేల్ రజతం, సెల్వ ప్రభు కాంస్య పతకాలు అందుకున్నారు.
పారా అథ్లెటిక్స్‌లో శర్మిలా ధంకర్, దిలీప్ గవిట్, సోమన్ రాణా స్వర్ణ పతకాలు గెలిచి భారత ఖాతాలో కీలక విజయాలు నమోదు చేశారు. మహ్మద్ బాసిల్, శుభమ్ జుయాల్ రజతాలు సాధించగా.. శిల్పా కె. శైలా కాంస్య పతకాన్ని అందుకుంది. జూడోలో కూడా భారత్ అద్భుత ప్రదర్శన కనబరిచింది. అస్మితా డే, హర్ష్ సింగ్ స్వర్ణ పతకాలు గెలవగా.. యామిని మౌర్యా రజతం, ఉన్నతి శర్మ కాంస్యం సాధించారు. ఇక బాక్సింగ్‌లో భారత బాక్సర్లు పూర్తిగా ఆధిపత్యం చెలాయించారు. ప్రీతి పవార్, జైస్మిన్ లాంబోరియా, సాక్షి చౌదరి, ప్రియా ఘంఘాస్, అరుంధతి చౌదరి, సచిన్ సివాచ్, అంకుశ్ పంఘాల్ స్వర్ణ పతకాలు సాధించారు. జడుమణి సింగ్, లవ్లీనా బోర్గొహైన్, నరేందర్ బెర్వాల్ రజత పతకాలు గెలిచారు. మొత్తంగా 39 పతకాలతో కామన్వెల్త్ గేమ్స్ 2026ను భారత్ ఘనంగా ముగించి ప్రపంచ వేదికపై మరోసారి తన క్రీడా శక్తిని చాటిచెప్పింది.
కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ మెడల్స్ ఫుల్ లిస్ట్ ఇదే:
ఝండూ కుమార్ – పురుషుల హెవీవెయిట్ పారా పవర్‌లిఫ్టింగ్ – కాంస్య పతకం
రిషికాంత సింగ్ – పురుషుల 60 కేజీల వెయిట్‌లిఫ్టింగ్ – రజత పతకం
మీరాబాయి చాను – మహిళల 48 కేజీల వెయిట్‌లిఫ్టింగ్ – స్వర్ణ పతకం
ముత్తుపాండి రాజా – పురుషుల 65 కేజీల వెయిట్‌లిఫ్టింగ్ – రజత పతకం
జ్ఞానేశ్వరి యాదవ్ – మహిళల 53 కేజీల వెయిట్‌లిఫ్టింగ్ – రజత పతకం
బింద్యారాణి దేవి – మహిళల 58 కేజీల వెయిట్‌లిఫ్టింగ్ – కాంస్య పతకం
శర్మిలా ధంకర్ – మహిళల షాట్‌పుట్ F57 (పారా అథ్లెటిక్స్) – స్వర్ణ పతకం
సర్వేశ్ కుషారే – పురుషుల హైజంప్ (అథ్లెటిక్స్) – రజత పతకం
శిల్పా కె. షైలా – మహిళల షాట్‌పుట్ F57 (పారా అథ్లెటిక్స్) – కాంస్య పతకం
వల్లూరి అజయ్ బాబు – పురుషుల 79 కేజీల వెయిట్‌లిఫ్టింగ్ – రజత పతకం
హర్జిందర్ కౌర్ – మహిళల 69 కేజీల వెయిట్‌లిఫ్టింగ్ – రజత పతకం
గుల్వీర్ సింగ్ – పురుషుల 10,000 మీటర్ల పరుగు (అథ్లెటిక్స్) – రజత పతకం
మురళీ శ్రీశంకర్ – పురుషుల లాంగ్ జంప్ (అథ్లెటిక్స్) – రజత పతకం
దిలీప్ గవిట్ – పురుషుల 100 మీటర్లు T47 (పారా అథ్లెటిక్స్) – స్వర్ణ పతకం
మహ్మద్ బాసిల్ – పురుషుల 100 మీటర్లు T47 (పారా అథ్లెటిక్స్) – రజత పతకం
లవ్‌ప్రీత్ సింగ్ – పురుషుల +110 కేజీల వెయిట్‌లిఫ్టింగ్ – రజత పతకం
సీమా కాలిరామ్నా – మహిళల డిస్కస్ త్రో (అథ్లెటిక్స్) – కాంస్య పతకం
అస్మితా డే – మహిళల -48 కేజీల జూడో – స్వర్ణ పతకం
హర్ష్ సింగ్ – పురుషుల -60 కేజీల జూడో – స్వర్ణ పతకం
యామిని మౌర్యా – మహిళల -57 కేజీల జూడో – రజత పతకం
తేజస్విన్ శంకర్ – పురుషుల డెకాథ్లాన్ (అథ్లెటిక్స్) – కాంస్య పతకం
యశ్ వీర్ సింగ్ – పురుషుల జావెలిన్ త్రో (అథ్లెటిక్స్) – కాంస్య పతకం
నీరజ్ చోప్రా – పురుషుల జావెలిన్ త్రో (అథ్లెటిక్స్) – రజత పతకం
ప్రీతి పవార్ – మహిళల 54 కేజీల బాక్సింగ్ – స్వర్ణ పతకం
ప్రవీణ్ చిత్రవేల్ – పురుషుల ట్రిపుల్ జంప్ (అథ్లెటిక్స్) – రజత పతకం
సెల్వ ప్రభు – పురుషుల ట్రిపుల్ జంప్ (అథ్లెటిక్స్) – కాంస్య పతకం
జైస్మిన్ లాంబోరియా – మహిళల 57 కేజీల బాక్సింగ్ – స్వర్ణ పతకం
జడుమణి సింగ్ – పురుషుల 55 కేజీల బాక్సింగ్ – రజత పతకం
శుభమ్ జుయాల్ – పురుషుల షాట్‌పుట్ F57 (పారా అథ్లెటిక్స్) – రజత పతకం
సోమన్ రాణా – పురుషుల షాట్‌పుట్ F57 (పారా అథ్లెటిక్స్) – స్వర్ణ పతకం
ఉన్నతి శర్మ – మహిళల -63 కేజీల జూడో – కాంస్య పతకం
సాక్షి చౌదరి – మహిళల 51 కేజీల బాక్సింగ్ – స్వర్ణ పతకం
ప్రియా ఘంఘాస్ – మహిళల 60 కేజీల బాక్సింగ్ – స్వర్ణ పతకం
అరుంధతి చౌదరి – మహిళల 70 కేజీల బాక్సింగ్ – స్వర్ణ పతకం
లవ్లీనా బోర్గొహైన్ – మహిళల 75 కేజీల బాక్సింగ్ – రజత పతకం
సచిన్ సివాచ్ – పురుషుల 60 కేజీల బాక్సింగ్ – స్వర్ణ పతకం
అంకుశ్ పంఘాల్ – పురుషుల 80 కేజీల బాక్సింగ్ – స్వర్ణ పతకం
నరేందర్ బెర్వాల్ – పురుషుల +90 కేజీల బాక్సింగ్ – రజత పతకం
గుల్వీర్ సింగ్ – పురుషుల 5,000 మీటర్ల పరుగు (అథ్లెటిక్స్) – కాంస్య పతకం
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!