Site icon NTV Telugu

IPL 2022: అప్పుడు లయన్స్.. ఇప్పుడు టైటాన్స్

Gujarath Titans

Gujarath Titans

క్రికెట్‌లో కొన్నిసార్లు విచిత్రాలు జరుగుతుంటాయి. ప్రస్తుతం ఐపీఎల్‌లోనూ ఓ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. గతంలో గుజరాత్ లయన్స్ జట్టు ఎలా ఆడుతుందో.. ఈ ఏడాది కొత్తగా రంగ ప్రవేశం చేసిన గుజరాత్ టైటాన్స్ జట్టు కూడా అలానే ఆడుతుండటం హాట్ టాపిక్‌గా మారింది. 2016 సీజన్‌లో గుజరాత్ లయన్స్ జట్టు ఆడిన తొలి మూడు మ్యాచ్‌లలో గెలిచింది. అయితే సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో జరిగిన 4వ మ్యాచ్‌లో గుజరాత్ లయన్స్ ఓటమి పాలైంది.

కట్ చేస్తే.. ఇప్పుడు గుజరాత్ టైటాన్స్ జట్టు కూడా వరుసగా మూడు మ్యాచ్‌లలో విజయం సాధించింది. ఈ టీమ్ కూడా 4వ మ్యాచ్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతోనే ఆడింది. అయితే గుజరాత్ లయన్స్ తరహాలో గుజరాత్ టైటాన్స్ కూడా ఓడిపోయింది. అంతేకాదండోయ్.. ఈ రెండు జట్లు ఐదో మ్యాచ్‌లో మళ్లీ విజయం సాధించాయి. మరి 6వ మ్యాచ్ ఫలితం ఎలా ఉంటుందో అని కొందరు నెటిజన్‌లు 2016 సీజన్‌లోని గుజరాత్ లయన్స్ ఫలితాన్ని గమనిస్తున్నారు. ఆనాడు గుజరాత్ లయన్స్ ఫైనల్‌ వరకు వెళ్లింది. ఇప్పుడు కూడా గుజరాత్ టైటాన్స్ జట్టుకు ప్లే ఆఫ్స్‌కు వెళ్లే అవకాశాలు ఉన్నాయని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. హార్డిక్ పాండ్యా నేతృత్వంలోని జట్టు మంచి ప్రదర్శన చేస్తుందని.. టైటిల్ గెలిచే ఛాన్స్ ఉందని లెక్కలు కడుతున్నారు. మరి ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే.

Cricket: ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్సీకి జో రూట్ గుడ్‌బై..!!

Exit mobile version