NTV Telugu Site icon

Chiranjeevi: యూఏఈలో ఇంటర్నేషనల్ లీగ్ టీ20.. మ్యాచ్‌ను తిలకించిన మెగాస్టార్ చిరంజీవి

Chiranjeevi

Chiranjeevi

Chiranjeevi: యూఏఈలో జరుగుతున్న ఇంటర్నేషనల్ లీగ్ టీ20లో మెగాస్టార్ చిరంజీవి తళుక్కున మెరిశారు. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ డైరెక్టర్ ముబాషిర్ ఉస్మాని, జీఎంఆర్ గ్రూప్ కార్పొరేట్ చైర్మన్ కిరణ్ కుమార్ గ్రంథితో కలిసి షార్జా స్టేడియంలో నిన్న (జనవరి 17) దుబాయ్ కేపిటల్స్, షార్జా వారియర్జ్ మధ్య జరిగిన మ్యాచ్‌ను ఆయన వీక్షించారు. ఇంటర్నేషనల్ లీగ్ టీ20కు సంబంధించిన వీడియోను తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. ఇక, ఈ వీడియోను చూసి మెగా ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు.

Read Also: Railway Budget 2025: ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న ఆర్థిక మంత్రి.. ఈ సారి భారీగా పెరగనున్న రైల్వే బడ్జెట్‌

అయితే, దుబాయ్ కేపిటల్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో షార్జా వారియర్జ్ టీమ్ ఐదు వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ సాధించింది. దుబాయ్ కేపిటల్స్ తొలి ఇన్సింగ్స్ లో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 201 రన్స్ చేయగా..షాయ్ హోప్ 52 బాల్స్ లో 3 ఫోర్లు, 6 సిక్సర్లతో 83 రన్స్ చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన షార్జా వారియర్జ్ 18.1 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి 202 పరుగులను సునాయసంగా ఛేదించి విజయాన్ని అందుకుంది. కాగా, ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవిష్కా ఫెర్నాండో నిలిచాడు.. అతడు కేవలం 27 బంతుల్లో 6 ఫోర్లు, 8 సిక్సర్లతో 81 రన్స్ చేశాడు.