Chess Championship: ఇటలీ వేదికగా జరుగుతున్న ప్రపంచ జూనియర్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో తెలుగు అమ్మాయికి చేదు అనుభవం ఎదురైంది. ఈ టోర్నీలో ఆడుతున్న విజయవాడ గ్రాండ్‌మాస్టర్ నూతక్కి ప్రియాంక టోర్నీ నుంచి బహిష్కరణకు గురైంది. ఈ పోటీల్లో భాగంగా మంగళవారం జరిగిన ఆరో రౌండ్‌కు ప్రియాంక పొరపాటున తన జేబులో మొబైల్ ఇయర్ బడ్స్‌తో వచ్చింది. చెకింగ్‌లో ఆమె జాకెట్‌లో ఇయర్ బడ్స్ బయటపడటంతో ఆటను రద్దు చేసి ప్రత్యర్థిని విజేతగా ప్రకటించారు. ఫౌల్ గేమ్ ఆడనప్పటికీ ఫిడే నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా నూతక్కి ప్రియాంక బహిష్కరణకు గురైంది. ఈ బహిష్కరణ అంశంపై భారత చెస్ సంఘం అధికారులు అప్పీల్ చేసినా ఫిడే తన నిర్ణయాన్ని మార్చుకోలేదు.
Read Also: IRCTC: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. టిక్కెట్ క్యాన్సిల్ చేసుకోవాలని భావిస్తున్నారా?
కాగా గేమ్ జరుగుతున్న సమయంలో ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించరు. ఒకవేళ ఎలక్ట్రానిక్ పరికరాలను తీసుకెవెళ్తే ఫెయిర్ ప్లే నిబంధనలను ఉల్లంఘించడమే కాకుండా గేమ్‌ను కూడా కోల్పోవాల్సి ఉంటుంది. ఏకంగా టోర్నీ నుంచి బహిష్కరణకు గురికావడంతో పాటు జరిమానా కూడా విధించబడుతుంది. ఈ మేరకు ఆరో రౌండ్‌లో నూతక్కి ప్రియాంక సాధించిన పాయింట్‌ను ఆమె ప్రత్యర్థి గోవర్ బెదుల్లేవాకు అందించారు. అటు చెస్ ఛాంపియన్‌షిప్‌లో నూతక్కి ప్రియాంక మొదటి ఐదు రౌండ్లలో మూడు విజయాలు, రెండు డ్రాలతో నాలుగు పాయింట్లు సాధించింది.