NTV Telugu Site icon

SRH vs CSK: టాస్ గెలిచిన సీఎస్కే.. బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్

Csk Vs Srh

Csk Vs Srh

Chennai Super Kings Won The Toss And Chose To Field: ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా శుక్రవారం చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడుతున్నాయి. ఈ సీజన్‌లో ఇది 29వ మ్యాచ్. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం (చెపాక్ స్టేడియం) వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో.. టాస్ గెలిచిన చెన్నై జట్టు ఫీల్డింగ్ ఎంపిక చేసుకుంది. దీంతో.. సన్‌రైజర్స్ బ్యాటింగ్ చేసేందుకు రంగంలోకి దిగింది. రెండు వరుస విజయాలతో దూకుడు మీదున్న సన్‌రైజర్స్‌కు గత మ్యాచ్‌లో ముంబై కళ్లెం వేయడంతో.. ఈ మ్యాచ్ ఎలాగైనా గెలవాలని ఆ జట్టు కసి మీద ఉంది. మరోవైపు.. గత మ్యాచ్‌లో బెంగళూరుపై ఘనవిజయం సాధించిన ధోనీ సేన.. ఈ మ్యాచ్‌లోనూ అదే కొనసాగించి, విజయం సాధించాలని పూనుకుంది. ఈ నేపథ్యంలో.. ఈ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారన్న ఉత్కంఠ నెలకొంది.

Coldest Places: ప్రపంచంలోని 9 అత్యంత శీతల ప్రదేశాలు

అయితే.. చెన్నై జట్టులో బ్యాటర్లు చాలామంది ఉన్నారు. ఏడో వికెట్ దాకా మెరుపులు మెరిపించే బ్యాటర్లు ఆ జట్టు సొంతం. అలాంటి జట్టుపై సన్‌రైజర్స్ రాణించాలంటే.. టాపార్డర్ అద్భుతంగా ఆడాల్సి ఉంటుంది. ఈ సీజన్‌లో ఒక మ్యాచ్‌లో సెంచరీతో సత్తా చాటిన బ్రూక్.. ఈ మ్యాచ్‌లోనూ మెరుగైన ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంటుంది. అతనితో పాటు రాహుల్ త్రిపాఠి, కెప్టెన్ మార్ర్కమ్ కూడా తమవంతు కృషి అందిస్తే.. చెన్నైకి గౌరవప్రదమైన లక్ష్యాన్ని ఇవ్వొచ్చు. ఇక్కడ మరో చిక్కు ఏమిటంటే.. ఈ మ్యాచ్ చెన్నై సొంత మైదానంలో జరగుతుంది. ఇంతవరకూ హోమ్ గ్రౌండ్‌లో 23 మ్యాచ్‌లు ఆడిన చెన్నై.. 19 గెలుపొందింది. దీన్ని బట్టి.. హోమ్ గ్రౌండ్‌లో ఆ జట్టుకి ఎంత పట్టు ఉందో అర్థం చేసుకోవచ్చు. కాబట్టి.. చెపాక్ స్టేడియంలో చెన్నైని ఓడించాంటే, సన్‌రైజర్స్ జట్టు అన్ని విభాగాల్లోనూ మెరుగ్గా రాణించాల్సి ఉంటుంది. చూద్దాం.. ఎవరెలాంటి ప్రదర్శనతో ఆధిపత్యం చెలాయిస్తారో?

Shane Watson: కోహ్లీ కడుపులో మంట కావొచ్చు.. కోహ్లీ-గంగూలీ వివాదంపై షేన్ వాట్సన్

తుది జట్లు:
సీఎస్కే: రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, అజింక్యా రహానే, శివమ్ దూబే, మొయిన్ అలీ, రవీంద్ర జడేజా, MS ధోని(కెప్టెన్‌/వికెట్‌ కీపర్‌), మహేశ్ తీక్షణ, తుషార్ దేశ్‌పాండే, ఆకాష్ సింగ్, మతీషా పతిరానా
ఎస్ఆర్‌హెచ్: హ్యారీ బ్రూక్, మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్‌రామ్(కెప్టెన్‌), హెన్రిచ్ క్లాసెన్(వికెట్‌కీపర్‌), అభిషేక్ శర్మ, వాషింగ్టన్ సుందర్, మార్కో జాన్సెన్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, ఉమ్రాన్ మాలిక్