NTV Telugu Site icon

CSK vs LSG: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంపిక చేసుకున్న సీఎస్కే

Lsg Vs Csk

Lsg Vs Csk

Chennai Super Kings Won The Toss And Chose To Bowl Against Lucknow Super Giants: ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా బుధవారం మధ్యాహ్నం చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ సీజన్‌లో ఇది 45వ మ్యాచ్. లక్నోలోని ఏకన స్పోర్ట్స్ సిటీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో.. సీఎస్కే టాస్ గెలిచి, ఫీల్డింగ్ ఎంపిక చేసుకుంది. దీంతో.. లక్నో బ్యాటింగ్ చేసేందుకు రంగంలోకి దిగింది. ఆల్రెడీ ఈ ఇరుజట్ల మధ్య ఏప్రిల్ 3వ తేదీన ఒక మ్యాచ్ జరగ్గా.. అందులో సీఎస్కే 12 పరుగుల తేడాతో గెలుపొందింది. ఇప్పుడు హోమ్‌గ్రౌండ్‌లో లక్నో జట్టు అందుకు ప్రతీకారం తీర్చుకుంటుందా? లేదా? అన్నది ఆసక్తి మారింది. ఇప్పటికే టాప్-4లో చోటు సంపాదించుకున్న ఈ జట్టు.. ఈ సీజన్‌లో 9 మ్యాచ్‌లు ఆడి, చెరో ఐదు విజయాలు నమోదు చేశాయి. అయితే.. రన్ రేట్ ప్రకారం లక్నో మూడో స్థానంలో ఉండగా, చెన్నై నాలుగో స్థానంలో ఉంది.

Akhil Akkineni: నీ కష్టం పగోడికి కూడా రాకూడదు బ్రో.. వీటికి దూరంగా వెళ్లిపో

గాయం కారణంగా కేఎల్ రాహుల్ దూరం కావడంతో.. లక్నోకి ఒక రకంగా పెద్ద దెబ్బేనని చెప్పుకోవచ్చు. అతడు నిదానంగా ఆడుతాడన్న ఆరోపణల్ని పక్కనపెడితే.. కెప్టెన్‌గా జట్టుని సమర్థవంతంగా నడిపించే నాయకత్వం అతని సొంతం. ఆటగాడిగానూ.. తన జట్టుకి శుభారంభాన్నే అందిస్తాడు. కానీ.. గాయంతో అతడు వైదొలగడంతో, కృనాల్ పాండ్యా సారథిగా వ్యవహరిస్తున్నాడు. ఇక ఇరుజట్ల సామర్థ్యాల గురించి మాట్లాడుకుంటే.. ఇరుజట్లలోనూ మంచి ప్లేయర్లు ఉన్నారు. విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడే స్టార్ బ్యాటర్లు, కట్టుదిట్టంగా బౌలింగ్ వేయగల బౌలర్లు ఉన్నారు. అవును.. ఇంతకుముందు హోమ్‌గ్రౌండ్‌లో ఆర్సీబీ చేతిలో లక్నో ఓటమిపాలైన విషయం తెలిసిందే! అది రిపీట్ అవ్వకుండా, పరువు కాపాడ్డం కోసం గెలుపొందాలన్న కసితో లక్నో బరిలోకి దిగుతోంది. అటు.. గత మ్యాచ్‌లో పంజాబ్ చేతిలో ఓడిన చెన్నై సైతం, ఈ మ్యాచ్‌తో పునరాగమనం ఇవ్వాలని పట్టుదలతో ఉంది. మరి, ఈ మ్యాచ్‌లో ఎవరు తమ సత్తా చాటుతారో చూడాలి.

Horrific Accident: బైకర్‌ను ఢీకొట్టి.. కారుపై మృతదేహంతో 3కి.మీ లాక్కెళ్లారు..