Site icon NTV Telugu

CSK vs KKR: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంపిక చేసుకున్న సీఎస్కే

Kkr Vs Csk

Kkr Vs Csk

Chennai Super Kings Won The Toss And Chose To Bat: ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు తలపడుతున్నాయి. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో సీఎస్కే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంపిక చేసుకుంది. పాయింట్స్ టేబుల్‌లో 15 పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా, కేకేఆర్ 10 పాయింట్లతో 8వ స్థానంలో ఉంది. కేకేఆర్ దాదాపు ప్లేఆఫ్స్ నుంచి నిష్ర్కమించింది. ఆ జట్టుకి ప్లేఆఫ్స్‌లో చోటు దక్కించుకునే అవకాశాలు లేవు. అటు.. చెన్నై జట్టుకి ఈ మ్యాచ్ ఓడినా పెద్దగా నష్టమేమీ లేదు. ఇతర జట్లతో పోలిస్తే, చెన్నై సేఫ్ జోన్‌లోనే ఉంది. ఒకవేళ ఈ మ్యాచ్ గెలిస్తే.. ప్లేఆఫ్స్‌లో బెర్త్ కన్ఫమ్ చేసుకుంటుంది. అయితే.. ప్లేఆఫ్స్‌ ఛాన్సెస్ లేకపోయినా, ఈ మ్యాచ్ గెలవాలని కేకేఆర్ పట్టుదలతో ఉంది.

RCB vs RR: పేకమేడలా కూలిన ఆర్ఆర్.. ఆర్సీబీ ఘనవిజయం

ఇదివరకే ఈ రెండు జట్ల మధ్య ఏప్రిల్ 23వ తేదీన మ్యాచ్ జరిగింది. కోల్‌కతా గడ్డపై ఆ జట్టుని చెన్నై చిత్తుచిత్తుగా ఓడించింది. ఏకంగా 49 పరుగుల తేడాతో కేకేఆర్‌పై ఘనవిజయం సాధించింది. తొలుత సీఎస్కే 235 పరుగులు చేయగా, కేకేఆర్ 186 పరుగులకే పరిమితం అయ్యింది. ఇప్పుడు అందుకు ప్రతీకారం తీర్చుకోవాలని కేకేఆర్ భావిస్తోంది. తమ సొంత గడ్డపై తమని చెన్నై జట్టు ఓడించింది కాబట్టి.. ఇప్పుడు వారి సొంత గడ్డపై చెన్నైని ఓడించి, రివేంజ్ తీసుకోవాలని అనుకుంటోంది. మరి.. కేకేఆర్ తన ప్రతీకారం తీర్చుకుంటుందా? లేక మరోసారి ఆ జట్టు చేతుల్లో ఓటమి పాలవుతుందా? మరికొన్ని గంటల్లోనే తేలిపోనుంది.

Priyanka Chopra: ‘కజిన్’ ఎంగేజ్మెంట్ లో ప్రియాంక సందడి…

Exit mobile version