Chennai Super Kings Won The Match By 6 Wickets Against Mumbai Indians: చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా శనివారం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. ముంబై నిర్దేశించిన 140 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని 4 వికెట్లు కోల్పోయి 17.4 ఓవర్లలోనే ఛేధించింది. ఎప్పట్లాగే రుతురాజ్(30), కాన్వే(44) శుభారంభం అందించడం.. శివమ్ దూబే (26) మెరుపులు మెరిపించడంతో.. చెన్నై సునాయాసంగా గెలుపొందింది. చెన్నై బ్యాటర్లు కనబర్చిన ఆటతీరు, లక్ష్యం చిన్నదే కావడంతో.. ఈ మ్యాచ్‌లో ధోనీ క్రీజులోకి రాకపోవచ్చని మొదట్లో అంతా అనుకున్నారు. అయితే.. నాలుగు వికెట్లు పడ్డాక అతడు సర్‌ప్రైజ్ ఎంట్రీ ఇచ్చాడు. ఈసారి భారీ షాట్లు కొట్టలేదు కానీ, చివర్లో విన్నింగ్ రన్ కొట్టి, జట్టుని గెలిపించాడు.
Bindu Madhavi: అవును, ఆ స్టార్ హీరోయిన్ ప్రియుడ్ని ప్రేమించా.. బిందు మాధవి బాంబ్
తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి కేవలం 139 పరుగులే చేసింది. స్టార్ బ్యాటర్లందరూ దారుణంగా విఫలమవ్వడం వల్లే ముంబై ఇంత తక్కువ స్కోరు చేసింది. యువ ఆటగాడు నేహాల్ వాధేరా (51 బంతుల్లో 64) ఒక్కడే ఒంటరి పోరాటం కొనసాగించి జట్టుని ఆదుకున్నాడు. అతడి పుణ్యమా అని.. ముంబై కనీసం అంత స్కోరు చేయగలిగింది. సూర్య(26), స్టబ్స్(20) జస్ట్ పర్వాలేదనిపించారంతే. ఇక 140 పరుగల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై జట్టు.. 17.4 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసి, విజయఢంకా మోగించింది. ఎప్పట్లాగే ఓపెనర్లైన రుతురాజ్, కాన్వే తమ జట్టుకి శుభారంభాన్ని అందించారు. ముఖ్యంగా రుతురాజ్ క్రీజులో ఉన్నంతసేపు బౌండరీల వర్షం కురిపించాడు. అతని తర్వాత వచ్చిన రహానే మాత్రం ఈసారి కాస్త తడబడ్డాడు. భారీ ఇన్నింగ్స్ ఆడకుండానే.. 21 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన అంబటి రాయుడు.. ఈ మ్యాచ్‌లోనూ నిరాశపరిచాడు. ఆ కాసేపటికే హాఫ్ సెంచరీకి చేరువైన కాన్వే.. 44 వ్యక్తిగత పరుగుల వద్ద ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు.
Manipur Violence: మణిపూర్‌లో హింసాకాండ.. ఇండో-మయన్మార్ సరిహద్దులో వైమానిక నిఘా
అప్పటికే క్రీజులో ఉన్న శివమ్ దూబే.. 3 సిక్సర్ల సహకారంతో 26 పరుగులు చేశాడు. ఇతడే విన్నింగ్ షాట్ కొడతాడని అందరూ భావించారు. కానీ.. అతడు సింగిల్ తీయడంతో, విన్నింగ్ షాట్ ధోనీకి వచ్చింది. సిక్సర్‌తో అతడు మ్యాచ్ ముగిస్తాడనుకుంటే.. సింగిల్‌తోనే సర్దుబాటు చేసుకున్నాడు. ఏదైతేనేం.. ధోనీ ఇచ్చిన ఈ చిన్న కేమియోని సైతం.. చెపాక్ స్టేడియంలోని అతని అభిమానులు బాగా ఎంజాయ్ చేశారు. ముంబై బౌలర్లలో పియూష్ చావ్లా రెండు వికెట్లు తీయగా.. ట్రిస్టన్ స్టబ్స్, ఆకాశ్ మధ్వాల్ చెరో వికెట్ పడగొట్టారు.
