Chennai Super Kings Won The Match By 27 Runs Against DC: బుధవారం చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఢిల్లీ క్యాపిటల్స్ ఘోర పరాజయం చవిచూసింది. సీఎస్కే నిర్దేశించిన 168 పరుగుల లక్ష్యాన్ని ఛేధించలేకపోయింది. 140 పరుగులకే తట్టుబుట్టా సర్దేసింది. దీంతో.. చెన్నై జట్టు 27 పరుగుల తేడాతో విజయం సాధించింది. చెన్నై బౌలర్ల ధాటికి ఢిల్లీ బ్యాటర్లు విలవిల్లాడారు. ఎవ్వరూ నిలకడగా రాణించలేకపోయారు. రుస్సో (35), మనీష్ పాండే (27) తమ జట్టుని గట్టెక్కించడం కోసం ప్రయత్నించారు కానీ.. ఫలితం లేకుండా పోయింది. చివర్లో అక్షర్ సైతం మెరుపులు మెరిపించినా.. అప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. దీంతో.. ఢిల్లీ ఓటమి తప్పలేదు.
Mahmood Ali : దేశంలోనే అత్యున్నత పోలీస్ శాఖగా తెలంగాణ పోలీస్
తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. చెన్నై బ్యాటర్లలో ఏ ఒక్కరూ భారీ ఇన్నింగ్స్ ఆడలేదు కానీ.. వచ్చిన ప్రతీ బ్యాటర్ తనవంతు సహకారం అందించాడు. రుతురాజ్(24), రహానే(21), దూబే(25), రాయుడు(23), జడేజా(21), ధోని(20).. ఇలా అందరూ డబుల్ డిజిట్ స్కోర్‌తో రాణించడంతో.. చెన్నై అంత స్కోరు చేయగలిగింది. అనంతరం 168 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 140 పరుగులే చేసింది. ఢిల్లీ జట్టుకి ఆదిలోనే మూడు ఎదురుదెబ్బలు తగిలాయి. సున్నా పరుగులకే వార్నర్ ఔట్ అవ్వగా.. ఆ కొద్దిసేపటికే ఫిల్ సాల్ట్ (17), మిచెల్ మార్ష్ (5) పెవిలియన్ బాట పట్టారు. అత్యంత కీలకమైన ఆ ముగ్గురు ఆటగాళ్లు ఔట్ అవ్వగా.. ఢిల్లీపై ఒత్తిడి పెరిగింది.
Shalini Pandey: ప్రీతి.. నువ్వు ఈ రేంజ్ లో చూపిస్తే కుర్రాళ్ల పరిస్థితి ఏంటి..?
అలాంటి పరిస్థితుల్లో వచ్చిన మనీష్ పాండే, రుస్సోలకు ఆచితూచి ఆడాల్సి వచ్చింది. మరో వికెట్ పడకుండా ఉండేందుకు.. వాళ్లు నిదానంగా లాక్కొచ్చారు. ఎక్కువ రిస్క్ తీసుకోకుండా.. చాలావరకు సింగిల్స్, డబుల్స్‌తోనే రాణించారు. ఎప్పుడో ఒకసారి బౌండరీ కొడుతూ.. అలా అలా నెట్టుకొచ్చారు. ఇక ఓవర్లు తగ్గే కొద్దీ లక్ష్యం పెరుగుతుండటంతో.. వీళ్లిద్దరు రెచ్చిపోవాలని అనుకున్నారు. కానీ.. ఇంతలోనే చెన్నై బౌలర్లు వాళ్లను పెవిలియన్ పంపించేశారు. రిపల్ పటేల్ అత్యంత చెత్త ఇన్నింగ్స్ ఆడాడు. 16 బంతుల్లో కేవలం 10 పరుగులే చేశాడు. చివర్లో అక్షర్ (12 బంతుల్లో 21) గట్టిగా బాదేందుకు ట్రై చేశారు కానీ.. అప్పటికే మ్యాచ్ చేజారిపోయింది. చెన్నై బౌలర్లలో పతిరానా 3, దీపక్ చహార్ 2, జడేజా 1 వికెట్ తీశారు.
