Chennai Super Kings Won The Match Against RCB: బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. చెన్నై జట్టు నిర్దేశించిన 227 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ ఛేధించలేకపోయింది. చివరివరకూ బాగానే పోరాడింది కానీ, ఫలితం లేకుండా పోయింది. లక్ష్యానికి చేరువ అయ్యారని అనుకునేలోపే.. ఆర్సీబీ వరుసగా వికెట్లు కోల్పోయింది. అదే టైంలో భారీ షాట్లు ఆడే మరో ప్లేయర్ కూడా లేకపోవడంతో.. 218 పరుగులకే బెంగళూరు పరిమితం అయ్యింది. దీంతో.. 8 పరుగుల తేడాతో ఆర్సీబీ ఓటమి చవిచూసింది.
BYD YangWang U9: రన్నింగ్ లో కారు టైర్ పేలినా నో టెన్షన్.. కొత్త టెక్నాలజీతో వచ్చిన ఎలక్ట్రిక్ కార్
తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది. డెవాన్ కాన్వే (83), శివమ్ దూబే (57) అర్థశతకాలతో దుమ్ముదులిపేయగా.. అజింక్యా రహానే (37) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. వీరితో పాటు క్రీజులో అడుగుపెట్టిన ప్రతీ బ్యాటర్ తమవంతు పరుగులు చేయడంతో.. చెన్నై అంత భారీ స్కోరు చేయగలిగింది. అనంతరం 227 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ జట్టుకి ఆదిలోనే హంసపాదు ఎదురైంది. స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఆరు పరుగుల వద్ద ఔటవ్వగా.. ఆ తర్వాత వచ్చిన లామ్రోర్ సున్నా పరుగులకే పెవిలియన్ చేరాడు. ఈ దెబ్బకు ఆర్సీబీ ఖేల్ ఖతమ్ అయ్యిందని అంతా అనుకున్నారు. కానీ.. ఆ తర్వాతి నుంచే అసలైన ఆట మొదలైంది. ఎవ్వరూ ఊహించని ఊచకోత మొదలైంది.
Physically Harassed : మైనర్ బాలికపై అత్యాచారం, హత్య.. మేనమామ కొడుకే
కెప్టెన్ డు ప్లెసిస్(62), గ్లెన్ మ్యాక్స్‌వెల్ (76) కలిసి దంచికొట్టారు. ఎడాపెడా షాట్లతో బౌండరీల వర్షం కురిపించారు. సీఎస్కే బౌలర్లకు ముచ్చెమటలు పట్టించారు. వీళ్లిద్దరి ధాటికి ఆర్సీబీ స్కోరు తారాజువ్వ కంటే వేగంగా పరుగులు పెట్టింది. మొదటి 10 ఓవర్లలోనే 121 స్కోరు నమోదైందంటే.. ఏ రేంజ్‌లో విజృంభించారో అర్థం చేసుకోవచ్చు. అయితే.. కాసేపటికే ఆ ఇద్దరు ఔటయ్యారు. దీంతో.. ఆర్సీబీ ఆశలు సన్నగిల్లాయి. అలాంటి సమయంలో దినేశ్ కార్తీక్ వచ్చి ఆశలు రేకెత్తించాడు. కానీ.. అతడు 28 వ్యక్తిగత పరుగుల వద్ద ఔటయ్యాక ఆర్సీబీ పరాజయం తథ్యం అయ్యింది. ఇంపాక్ట్ ప్లేయర్ సుయాశ్ ప్రయత్నించినా, ఫలితం లేకుండా పోయింది. దీంతో.. 218 పరుగులకే ఆర్సీబీ చాపచుట్టేసింది.