Site icon NTV Telugu

CSK vs KKR Dream11 Prediction: చెన్నై, కోల్‌కతా డ్రీమ్ 11 టీమ్.. కెప్టెన్, వైస్ కెప్టెన్ టిప్స్!

Ck

Ck

IPL 2024 CSK vs KKR Dream11 Team Prediction: ఐపీఎల్‌ 2024లో భాగంగా నేడు రసవత్తర సమరం జరుగనుంది. గత సీజన్‌ విజేత చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడనున్నాయి. చెన్నై కోల్‌కతా మ్యాచ్ అంటే ఫాన్స్ కి పూనకాలు అనే చెప్పాలి. చెన్నైలోని చిదంబరం స్టేడియంలో రాత్రి 7.30కు ఈ మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ సీజన్‌లో ఇరు జట్లు కూడా మంచి బాటింగ్ మరియు బౌలింగ్ తో విజయాలు సాధించి మంచి జోష్‌లో ఉన్నాయి. కోల్‌కతా ఆడిన మూడు మ్యాచ్స్ లోను మూడు గెలిచి విన్నింగ్ స్ట్రైక్ ను కొనసాగిస్తోంది. ఇక చెన్నై నాలుగు మ్యాచ్‌లో రెండు ఓడిపోగా రెండు గెలుపొందాయి. దింతో విజయం ఎవరు సాధిస్తారో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Also Read; CSK vs KKR: కోల్‌కతాతో మ్యాచ్‌.. చెన్నైకి శుభవార్త!

హెడ్ టు హెడ్ రికార్డుల్లో చెన్నై సూపర్ కింగ్స్‌ కోల్‌కతా నైట్ రైడర్స్ పైచేయి కలిగి ఉంది. ఇరుజట్లు ఇప్పటివరకు ముప్పై మ్యాచ్‌ల్లో ఎదురుపడగా.. చెన్నై 18 మ్యాచ్‌ల్లో కోల్‌కతా 10 మ్యాచ్స్ గెలుపొందాయి. చెపాక్‌ స్టేడియం లో పది మ్యాచులు ఆడగా చెన్నై కోల్‌కతా పైన 7-3 విజయం సాధించింది. అయితే పవర్ ప్లే లో కోల్‌కతా ప్లేయర్స్ ని ఆడ్డుకోవడం కష్టమే అని చెప్పాలి. ఎర్లీ వికెట్స్ తియ్యకుంటే చెన్నై భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇక చెపాక్‌లో వాతావరణం​ ఆటకు ఆనువుగా ఉంటుంది. వాతావరణం నుంచి మ్యాచ్‌కు ఎలాంటి అవాంతరాలు ఉండవు. సొంత మైదానంలో ఆడనుండటంతో ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే ఫెవరేట్ అని చెప్పాలి.

Also Read; LSG vs GT: లక్నో సూపర్ విక్టరీ.. ఇరగదీసిన యష్ ఠాకూర్

తుది జట్లు:
చెన్నై సూపర్ కింగ్స్: ఋతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), రచిన్ రవీంద్ర, అజింక్యా రహానే, డారిల్ మిచెల్, రవీంద్ర జడేజా, సమీర్ రిజ్వీ, ఎంఎస్ ధోనీ, దీపక్ చహర్, మహీశ తీక్షణ, ముస్తాఫిజుర్ రెహమాన్, తుషార్ దేశ్‌పాండే.

కోల్‌కతా నైట్ రైడర్స్: సునీల్ నరైన్, ఫిల్ సాల్ట్, అంగ్క్రిష్ రఘువంశీ, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, మిచెల్ స్టార్క్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి

డ్రీమ్ 11 టీమ్:
వికెట్ కీపర్: ఫిల్ సాల్ట్
బ్యాటర్లు: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), అంగ్క్రిష్ రఘువంశీ (వైస్ కెప్టెన్), అజింక్యా రహానే, శ్రేయాస్ అయ్యర్
ఆల్ రౌండర్లు: రవీంద్ర జడేజా, రచిన్ రవీంద్ర, సునీల్ నరైన్
బౌలర్లు: మిచెల్ స్టార్క్, ముస్తాఫిజుర్ రెహమాన్, హర్షిత్ రాణా

Exit mobile version