Site icon NTV Telugu

IPL 2022: రాబిన్ ఉతప్ప, శివం దూబె మెరుపు బ్యాటింగ్.. చెన్నై భారీ స్కోరు

ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు భారీ స్కోర్ చేసింది. 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. ఓపెనర్ రాబిన్ ఊతప్ప (50) మెరుపు బ్యాటింగ్ చేశాడు. 27 బంతుల్లో 8 ఫోర్లు, ఒక సిక్స్ బాదాడు. అతడు అవుటైనా శివమ్‌ దూబె (49) కూడా దూకుడుగా ఆడాడు. అయితే తృటిలో హాఫ్ సెంచరీ చేసే అవకాశం కోల్పోయాడు. దూబె 30 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు. అటు మొయిన్ అలీ (35), అంబటి రాయుడు (27), జడేజా(17), ధోనీ(16 నాటౌట్) రాణించారు. లక్నో బౌలర్లలో రవి బిష్ణోయ్‌ 2, అవేష్ ఖాన్‌ 2, ఆండ్రూ టై తలో రెండు వికెట్లు తీశారు.

https://www.youtube.com/watch?v=srXqU5giPlU
Exit mobile version