Site icon NTV Telugu

Jasprit Bumrah: ఐసీసీ టెస్టు క్రికెటర్ ఆఫ్‌ ది ఇయర్‌గా బుమ్రా.. తొలి భారత పేసర్ గా రికార్డ్!

Bumrah

Bumrah

జస్ ప్రీత్ బుమ్రా.. బుల్లెట్ లాంటి బంతులతో బౌలింగ్ చేస్తూ ప్రత్యర్థి ప్లేయర్స్ కు ముచ్చెమటలు పట్టిస్తాడు. మెరుపు బౌలింగ్ తో ప్రత్యర్థి జట్లను చతికిలపడేస్తాడు. టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషిస్తుంటాడు. క్రికెట్ హిస్టరీలో ఎన్నో రికార్డులను సొంతం చేసుకున్నాడు జస్ ప్రీత్ బుమ్రా. ఇప్పుడు మరోసారి అరుదైన గౌరవాన్ని దక్కించుకుని హిస్టరీ క్రియేట్ చేశాడు. స్టార్ పేసర్ జస్‌ప్రీత్‌ బుమ్రా 2024కి గానూ ఐసీసీ టెస్టు ప్లేయర్ ఆఫ్‌ ది ఇయర్‌గా ఎంపికయ్యాడు.

ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఈ విషయాన్ని ప్రకటించింది. క్రికెట్ లో అత్యుత్తమ ప్రతిభకనబర్చినందుకు గాను బుమ్రాను ఈ అవార్డుకు ఎంపిక చేసింది. కాగా బుమ్రా గతేడాది 13 టెస్టుల్లో 14.92 సగటుతో 71 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. జో రూట్ (ఇంగ్లాండ్), కమిందు మెండిస్ (శ్రీలంక), హ్యారీ బ్రూక్ (ఇంగ్లాండ్)లను వెనక్కి నెట్టి బుమ్రా ఈ అవార్డును అందుకున్నాడు. ఈ మైలురాయిని సాధించిన తొలి భారత ఫాస్ట్ బౌలర్ బుమ్రా. ఐసీసీ టెస్టు క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకున్న ఆరో భారత ప్లేయర్‌గానూ బుమ్రా నిలిచాడు. ఇంతకుముందు ఆర్ అశ్విన్, విరాట్ కోహ్లీ సహా కొంతమంది స్టార్ ఆటగాళ్లు ఈ జాబితాలో ఉన్నారు.

Exit mobile version