ప్రస్తుతం దుబాయ్‌లో జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌తో టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి పదవీకాలం ముగియనుంది. ఇప్పటికే హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ ఎంపికయ్యాడు. హెడ్ కోచ్‌గా రవిశాస్త్రి దిగిపోయిన తర్వాత అతడి భవితవ్యం ఏంటనే విషయంపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. అయితే రవిశాస్త్రి ముందు ఓ బంపర్ ఆఫర్ నిలిచింది. ఐపీఎల్‌లో కొత్త జట్టు అయిన అహ్మదాబాద్ ఫ్రాంచైజీ రవిశాస్త్రిని తమ హెడ్ కోచ్‌గా నియమించుకోవాలని భావిస్తోంది. దీనిపై రవిశాస్త్రిని ఫ్రాంచైజీ యాజమాన్యం సంప్రదించినట్లు సమాచారం.
Read Also: ఇంగ్లండ్‌పై దక్షిణాఫ్రికా గ్రాండ్ విక్టరీ..అయినా ఇంటికే !
కాగా ప్రస్తుతం టీ20 ప్రపంచకప్ ఉన్నందున నిర్ణయం తీసుకునేందుకు తనకు సమయం కావాలని రవిశాస్త్రి అడిగినట్లు తెలుస్తోంది. రవిశాస్త్రితో పాటు టీమిండియా బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్‌లను కూడా అహ్మదాబాద్ ప్రాంఛైజీ సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి. రూ.5,600 కోట్లతో ఐపీఎల్‌లో అహ్మదాబాద్ ఫ్రాంచైజీని కొనుగోలు చేసిన సీవీసీ క్యాపిటల్స్.. త్వరలో జరిగే వేలంలో కూడా ఆటగాళ్లకు, కోచింగ్ సిబ్బందికి భారీగా ముట్టజెప్పనుందనే వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి.
ఒకవేళ కోచ్ పదవి నుంచి తప్పుకున్న తర్వాత రవిశాస్త్రి గతంలో లాగా కామెంటేటర్‌గా ఉండాలని భావిస్తే.. ఐపీఎల్‌లో కోచ్‌గా అయ్యే అవకాశాలు ఉండవు. ఎందుకంటే పరస్పర విరుద్ధ ప్రయోజనాల నిబంధన కింద రవిశాస్త్రి ఏదో ఒకదానినే ఎంచుకోవాలి. కాగా 2014లో టీమిండియా కోచ్‌గా రవిశాస్త్రి బాధ్యతలు తీసుకున్నాడు. అప్పటి నుంచి మధ్యలో ఓ ఏడాది విరామం తప్ప ఇప్పటివరకు ఆయనే కోచ్‌గా కొనసాగుతున్నాడు.
