Site icon NTV Telugu

Cricket: ఇంగ్లండ్ టెస్ట్ జట్టు కోచ్‌గా న్యూజిలాండ్ దిగ్గజం

Brendon Mccullum

Brendon Mccullum

టెస్ట్ క్రికెట్‌లో ఇంగ్లండ్ జట్టు ఇటీవల వరుస పరాజయాలను చవిచూస్తోంది. చివరకు బలహీన జట్లపైనా ఆ జట్టు పేలవ ప్రదర్శన చేస్తోంది. గత 17 టెస్టుల్లో ఇంగ్లండ్ కేవలం ఒక్క మ్యాచ్‌లో మాత్రమే విజయం సాధించింది. దీంతో ఇంగ్లండ్ బోర్డు ప్రక్షాళన చేపట్టింది. టెస్ట్ జట్టుకు కొత్త కోచ్‌ను నియమించింది. ఈ మేరకు న్యూజిలాండ్ మాజీ ఆటగాడు, స్టార్ క్రికెటర్ బ్రెండన్ మెక్‌కలమ్‌ను కోచ్‌గా అపాయింట్ చేస్తున్నట్లు ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. కొద్దిరోజులుగా మెక్‌కలమ్‌తో జరిపిన సుదీర్ఘ చర్చల అనంతరం ఈసీబీ మేనేజింగ్ డైరెక్టర్ రాబ్ కీ ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు.

IPL 2022: ప్లేఆఫ్స్ రేసు నుంచి చెన్నై అవుట్..!!

మరోవైపు ఇప్పటికే ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్‌గా జో రూట్ తప్పుకోగా.. కొత్త కెప్టెన్‌గా బెన్ స్టోక్స్‌ను ఈసీబీ నియమించింది. వచ్చే నెలలో మూడు టెస్టుల సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టు ఇంగ్లండ్‌లో పర్యటించనుంది. ఈ సిరీస్ నుంచే బెన్ స్టోక్స్ ఇంగ్లాండ్ సారథిగా బాధ్యతలు చేపట్టనున్నాడు. అయితే ఇప్పుడు మెక్‌కలమ్ ఇంగ్లండ్ హెడ్​ కోచ్‌గా నియామకమైన నేపథ్యంలో న్యూజిలాండ్ జట్టుకు అతడు వ్యతిరేకంగా పనిచేయాల్సి ఉంటుంది. జూన్ 2న ఇంగ్లండ్-న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది.

Exit mobile version