న్యూజిలాండ్ తో జరగనున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్, ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌కు పేసర్ భువనేశ్వర్ కుమార్ బీసీసీఐ సెలెక్టర్లు ఎంపిక చేయలేదు. దాంతో ఇక అతను టెస్ట్ క్రికెట్ ఆడలేదని కొన్ని వార్తలు వచ్చాయి. అయితే ఇలాంటి వార్తల పై భువీ తాజాగా తన ట్విట్టర్ లో స్పందించాడు. అందులో ‘నాకు టెస్ట్ క్రికెట్ ఆడడం ఇష్టం లేదని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. వారికీ క్లారిటీ ఇస్తున్నా.. జట్టు ఎంపికతో సంబంధం లేకుండా.. మూడు ఫార్మాట్లలలో ఆడడానికే నేను ఎప్పుడూ సిద్ధంగా ఉంటా. జట్టులోకి ఎంపికయినా.. కాకున్నా ఇదే పద్దతి ఫాలో అయ్యా. ఇకపై కూడా ఇలానే కొనసాగుతా. చివరగా ఓ సలహా.. మీ ఊహాగానాల ఆధారంగా అసత్య ప్రచారాలు రాయొద్దు’ అని భువనేశ్వర్ ట్వీట్ చేశాడు. అయితే ఇప్పటివరకీ భారత్ తరఫున భువీ 21 టెస్టులు ఆడిన భువీ ఎక్కువ గాయాల బారిన పడటంతో మెళ్లిగా టెస్టు జట్టులో చోటు కోల్పోయాడు.