Bharath Wrestler: కెరీర్‌లో మూడోసారి బంగారు పతకాన్ని గెలుచుకున్న భరత్ రెజ్లింగ్ ఛాంపియన్
- కెరీర్‌లో మూడోసారి బంగారు పతకాన్ని గెలుచుకున్న భరత్ రెజ్లర్
- మహిళల 50 కేజీల విభాగంలో భరత్ కి గోల్డ్ మెడల్
- ఫైనల్‌లో 10-5తో ఓడించి స్వర్ణం కైవసం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bharath Wrestler Vinesh Phoghat Won The Gold Medal: మ్యాడ్రిడ్‌లో శనివారం జరిగిన గ్రాండ్‌ప్రీ ఆఫ్ స్పెయిన్‌లో మహిళల 50 కేజీల విభాగంలో భరత్ రెజ్లింగ్ ఛాంపియన్ వినేష్ ఫోగట్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్‌షిప్ కాంస్య పతక విజేత, ఇప్పుడు ఇండివిజువల్ న్యూట్రల్ అథ్లెట్‌గా పోటీపడుతున్న రష్యా మాజీ రెజ్లర్ “మరియా టియుమెరెకోవా”ను ఫైనల్‌లో 10-5తో ఓడించి స్వర్ణం కైవసం చేసుకుంది. వినేష్ ఫైనల్‌కు వెళ్లేందుకు పెద్దగా కష్టపడకుండా మూడు బౌట్‌లను గెలుచుకుంది. 29 ఏళ్ల మాజీ ఆసియా గేమ్స్ స్వర్ణ పతక విజేత క్యూబాకు చెందిన పాన్ అమెరికన్ ఛాంపియన్ యుస్నీలిస్ గుజ్మాన్‌ను 12-4 పాయింట్లతో ఓడించింది. 2022లో బర్మింగ్‌హామ్ వేదికగా జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో రజత పతక విజేత కెనడాకు చెందిన మాడిసన్ పార్క్స్‌పై క్వార్టర్ ఫైనల్స్‌లో ఆమె విజయం నమోదు చేసింది వినేష్ ఫోగట్.
Also Read
- IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?
- Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!
- India vs Zimbabwe: ఇంగ్లండ్‌లో తమ్ముడు సామ్ కరన్.. జింబాబ్వే టీమ్‌లో అన్న బెన్ కరన్.. టీమిండియాకు ‘కరన్’ గండం!
- Abhishek Sharma: కాటేరమ్మ కొడుకు చరిత్ర సృష్టిస్తాడా?..
సెమీఫైనల్లో వినేశ్ 9-4 పాయింట్ల తేడాతో కెనడాకు చెందిన కేటీ డచ్చక్‌పై గెలిచింది. ఇక వినేష్ ఫోగట్ తన కెరీర్‌లో మూడోసారి బంగారు పతకాన్ని గెలుచుకుంది. ఆమె గతంలో కామన్వెల్త్ గేమ్స్ గోల్డ్ కోస్ట్ 2018 మరియు ఆసియన్ గేమ్స్ జకార్తా 2018లో ఈ వెయిట్ విభాగంలో బంగారు పతకాలను గెలుచుకుంది. ఆసియా ఛాంపియన్‌షిప్ బిష్కెక్ 2018లో ఈ వెయిట్ విభాగంలో రజత పతకాన్ని గెలుచుకుంది. అంతకు ముందు జూలై 3న, వినేష్ ఫోగాట్ ఆమెకు వీసా రాలేదని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన తర్వాత ప్రభుత్వం సహాయంతో ఆమె స్కెంజెన్ వీసా పొందింది. తన వీసాకు సంబంధించిన సమాచారం లేనందున ఆమె మొదట్లో క్రీడా మంత్రి మన్సుఖ్ మాండవియా, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచి “అత్యవసర సహాయం” కోరింది. దీంతో స్పందించిన కేంద్రం.. ఆమెకు వెంటనే వీసా వచ్చే విధంగా చర్యలు చేపట్టింది. దీంతో ప్రభుత్వానికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. అలానే స్వర్ణ పతాకాన్ని సాధించిన పొగట్ కి అందరూ అభినందనలు తెలియజేస్తున్నారు.
తాజావార్తలు
-
RAW NTR: ఊహించని ట్విస్ట్.. ‘రా ఎన్టీఆర్’కు గుడ్‌బై.. అసలు ఏమైంది?
-
Abhijit Deepke: అభిజిత్ దీప్కే సంచలన ఆరోపణలు.. “బీజేపీ కార్యకర్తలు రాళ్లు విసిరారు, ముందే రాళ్లు తెచ్చుకున్నరు”
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?
-
Dharmendra Pradhan Education: ధర్మేంద్ర ప్రధాన్ ఎంత వరకు చదువు, ఆస్తుల వివరాలు మీకు తెలుసా?
ట్రెండింగ్
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!
-
6 ఏళ్ల తర్వాత ‘S’ సిరీస్ కమ్‌బ్యాక్.. ప్రీమియం ఫీచర్లతో అతి త్వరలో రాబోతున్న Vivo S2 స్మార్ట్ ఫోన్.!
-
అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!
-
Samsung కొత్త స్మార్ట్‌వాచ్‌లు వచ్చేశాయి.. AI హెల్త్ ట్రాకింగ్‌తో Samsung Galaxy Watch9, Ultra2 లాంచ్..!
-
IND vs ZIM 1st T20: నేడు జింబాబ్వేతో తొలి టీ20.. వైభవ్‌పై భారీ అంచనాలు.. ప్లేయింగ్ 11, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!