NTV Telugu Site icon

ఆటగాళ్ల విశ్రాంతి కోసం బీసీసీఐ ప్రత్యేక కమిటీ…

యూఏఈ లో జరుగుతున్న ఐసీసీ టీ20 ప్రపంచ కప్ నుండి భారత జట్టు నిష్క్రమించిన తర్వాత విశ్రాంతి అనే పదం బాగా తెరపైకి వచ్చింది. అది లేకనే భారత ఆటగాళ్లు ఈ టోర్నీలో సరిగా ప్రదర్శన చేయలేదు అని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇకపై ఆటగాళ్ల ఒత్తిడిని అంచనా వేసి.. ఎవరికి ఎప్పుడు విశ్రాంతి అవసరమో బీసీసీఐనే నిర్ణయించనున్నట్లు… ఇందుకోసం ఒక కమిటీని కూడా నియమించబోతున్నట్లు సమాచారం. ఆ కమిటీలో భారత కొత్త కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ కూడా ఒక సభ్యుడిగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఏ ఆటగాడు ఎన్ని మ్యాచ్‌లు ఆడుతున్నాడు, ఎంత కాలం బయో బబుల్లో గడుపుతున్నాడు అనేది చూసి… ప్రతి ఆటగాడికి విశ్రాంతిని ఇచ్చేలా చూడటం ఈ కమిటీ పని అనేది తెలుస్తుంది.