BCCI: భారత సీనియర్ మహిళల క్రికెట్ జట్టు హెడ్ కోచ్ పదవి కోసం అన్వేషణ ప్రారంభించింది బీసీసీఐ.. దీనికోసం దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ ఏడాది ప్రారంభంలో మహిళల టీ20 ప్రపంచకప్‌కు ముందు రమేష్ పొవార్ బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA)కి బదిలీ చేయబడ్డారు.. అప్పటి నుంచి ఆ స్థానం ఖాళీగా ఉంది. అయితే, టీ20 ప్రపంచకప్‌కు బ్యాటింగ్ కోచ్ హృషికేష్ కనిట్కర్‌ను జట్టుకు ఇంఛార్జ్‌గా నియమించారు, ఇక్కడ సెమీ-ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓటమి పాలైన విషయం విదితమే.
Read Also: Supreme Court: ఏపీ ప్రభుత్వ సిట్.. నేడు సుప్రీంకోర్టు తీర్పు
అయితే, మహిళల క్రికెట్ జట్టుకు పూర్తిస్థాయిలో హెడ్‌కోచ్‌ను నియమించాలని భావిస్తోన్న బీసీసీఐ.. ఇప్పుడు దరఖాస్తులు ఆహ్వానించింది.. బీసీసీఐ ప్రకటన ప్రకారం, దరఖాస్తుదారు తప్పనిసరిగా అంతర్జాతీయ క్రికెట్ ఆడాలి, లేదా కనీసం ఎన్‌సీఏ స్థాయి సీ- సర్టిఫైడ్ కోచ్ అయి ఉండాలి లేదా ఒక ప్రసిద్ధ సంస్థ నుండి ఇలాంటి ధృవీకరణ కలిగి ఉండాలి. అలాగే అంతర్జాతీయ జట్టుకు కనీసం ఒక్క సీజన్‌కైనా శిక్షణ ఇచ్చిన అనుభవం ఉండాలి. ఇందులో ఏ ఒక్క అర్హత ఉన్నా ఈ నెల 10వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని బీసీసీఐ తన ప్రకటనలో పేర్కొంది.. హెడ్ కోచ్ ఒక బలమైన జట్టును ఏర్పాటు చేయడం, మహిళల కోచింగ్ వ్యవస్థను అభివృద్ధి చేయడం మరియు ఫిట్‌నెస్, పనితీరు ప్రమాణాలను పర్యవేక్షించడంతో పాటు “అప్పటికప్పుడు బీసీసీఐ సూచించిన విధంగా నడుచుకునే విధంగా ఉండాలని భావిస్తున్నారు.
