వచ్చే ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ ను భారతదేశంలో జరుపగలుతామని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే నిన్న ఐపీఎల్ 2021 లో విజయం సాధించిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు గంగూలీ టైటిల్ ను అందించాడు. అయితే ఈ ఏడాది ఇండియాలో ప్రారంభమైన ఐపీఎల్ 2021 కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పది యూఏఈ లో జరిగింది. కానీ వచ్చే ఏడాది ఐపీఎల్ 2022 ను భారత్ లోనే జరపాలని అనుకుంటున్నట్లు దాదా చెప్పాడు. ఎందుకంటే ఇది భారత టోర్నమెంట్” అని గంగూలీ అన్నారు. ఈ ఐపీఎల్ కు ఇంకా 8 నెలల సమయం ఉంది. కాబట్టి అప్పటి వరకు దేశంలో కరోనా పరిస్థితులు మెరుగుపడతాయని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఆ సీజన్ ను ఇండియాలో భారత అభిమానుల మధ్య జరగాలని తాను ఆశిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు గంగూలీ.
ఐపీఎల్ 2022 పై గంగూలీ కీలక వ్యాఖ్యలు…
