Team India: టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్‌ను తొలగించబోతున్నారన్న వార్తలను బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ఖండించారు. గంభీర్ స్థానంలో వీవీఎస్ లక్ష్మణ్‌ను టెస్టు కోచ్‌గా నియమించేందుకు బీసీసీఐ ప్రయత్నాలు చేస్తోందన్న మీడియా కథనాలు పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు. కాగా, ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో భారత్ 0-2తో స్వదేశంలో వైట్‌వాష్ కావడంతో ఈ ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. అంతకు ముందు ఏడాది న్యూజిలాండ్ చేతిలో 0-3తో ఓడిపోవడం కూడా భారత్‌కు భారీ ఎదురు తగిలింది. ఆ పరాజయాల నేపథ్యంలో గంభీర్ కోచింగ్ భవిష్యత్తుపై అనేక కథనాలు వెలువడ్డాయి.
Read Also: Mahabubnagar: 9వ తరగతి బాలుడితో ఇంటర్ విద్యార్థిని ప్రేమాయణం.. ఆరు నెలల గర్భవతి!
ఇక, రాజీవ్ శుక్లా మాట్లాడుతూ.. గౌతమ్ గంభీర్‌ను తొలగించాలన్నా, కొత్త టెస్టు కోచ్‌ను నియమించాలన్నా బీసీసీఐలో ఎలాంటి ఆలోచన లేదన్నారు. ఈ విషయంలో బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా కూడా ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్పారు. మీడియాలో వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదన్నారు. టెస్టు జట్టు కోచింగ్ వ్యవస్థలో మార్పులు చేయాలని బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు. అయితే, టెస్టుల కంటే ప్రస్తుతం భారత జట్టుకు కీలకమైన సవాల్ T20 ప్రపంచకప్ అని బీసీసీఐ వర్గాలు పేర్కొంటున్నాయి. ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభమయ్యే టీ20 వరల్డ్‌కప్‌లో భారత్ తమ టైటిల్‌ను కాపాడుకోవడంపై దృష్టి సారించింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లేని పరిస్థితుల్లో సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో యువ జట్టు ఈ టోర్నీలో బరిలోకి దిగనుంది.
Read Also:
అయితే, భారత్ తమ తొలి మ్యాచ్‌ను ఫిబ్రవరి 7న ముంబైలో అమెరికాతో ఆడనుంది. గ్రూప్ ఏలో పాకిస్థాన్, నమీబియా, నెదర్లాండ్స్, యూఎస్‌ఏతో భారత్ పోటీ పడనుంది. యువ ఆటగాళ్లతో కూడిన ఈ జట్టు టీ20ల్లో అజేయంగా కొనసాగుతున్న నేపథ్యంలో, హోం గ్రౌండ్‌లో జరిగే ప్రపంచకప్ భారత్‌కు మరో సవాల్‌గా మారనుంది.
