T20 World Cup: టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ అధికారికంగా బయటకు వెళ్లింది. బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్‌ను అధికారికంగా నియమించినట్లు ఐసీసీ శుక్రవారమే ప్రకటించింది. భద్రతా కారణాలను పేర్కొంటూ భారత్‌లో ఆడమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్(బీసీబీ) నిర్ణయించుకుంది. తమ వేదికను శ్రీలంకుకు మార్చాలని డిమాండ్ చేసింది. అయితే, దీనికి ఐసీసీ ఒప్పుకోలేదు. శనివారం రోజు ఐసీసీ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు ఒక లేఖ రాసి, మీ స్థానంలో స్కాట్లాండ్‌ను తీసుకున్నట్లు తెలియజేసిందని నివేదికలు చెబుతున్నాయి.
Read Also: China: చైనా సైన్యంలో ఏం జరుగుతోంది.? టాప్ మిలిటరీ అధికారులపై విచారణ ఎందుకు..
బంగ్లాదేశ్ వివాదం, టోర్నమెంట్‌పై నిర్ణయం తీసుకోవడానికి ఐసీసీ చైర్మన్ జై షా అధ్యక్షతన శుక్రవారం దుబాయ్‌లో కీలక సమావేశం జరిగింది. దీనికి ముందు, చివరి ప్రయత్నంగా తమ సమస్యను డిస్ప్యూట్ రిజల్యూషన్ కమిటీకి పంపాలని ఐసీసీని కోరింది. అయితే, కమిటీ అప్పీల్ అధికారాలు లేవని, ఐసీసీ తుది నిర్ణయంతో ముందుకు వెళ్లాలని నిర్ణయించింది. ఐసీసీ ఇచ్చిన గడువులోగా బంగ్లాదేశ్ స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోవడంతో, ఆ జట్టును టోర్నీ నుంచి తొలగించి స్కాట్లాండ్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
అనూహ్యంగా స్కాట్లాండ్‌కు ఈ అవకాశం వచ్చింది. స్కాట్లాండ్ 5 టీ20 వరల్డ్ కప్‌లలో పాల్గొంది. 2022, 2024 ఎడిషన్లలో ఆడింది. అయితే, సూపర్ -8కు చేరుకోకపోయినా, బలమైన జట్లకు గట్టి పోటీని ఇచ్చింది. 2024 వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లను దాదాపుగా ఓడించే ప్రయత్నం చేసింది. యూరోపియన్ క్వాలిఫయర్స్‌లో ఇటలీ, నెదర్లాండ్స్ కన్నా వెనకబడినప్పటికీ, ఐసీసీ ర్యాకింగ్స్ ఆధారంగా స్కాట్లాండ్ ఎంపిక జరిగింది. ప్రస్తుతం, బంగ్లాదేశ్ దాదాపుగా బయటకు పోవడంతో గ్రూప్-సీలో స్కాట్లాండ్, నేపాల్, వెస్టిండీస్, ఇటలీ జట్లు ఉంటాయి.
