Site icon NTV Telugu

IPL 2022: సెంచరీతో చెలరేగిన పటీదార్.. లక్నో ముందు భారీ టార్గెట్

Patidar

Patidar

ఐపీఎల్‌లో ఎలిమినేటర్ మ్యాచ్‌లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జూలు విదిల్చింది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో నిర్ణీత 20 ఓవర్లలో బెంగళూరు భారీ స్కోరు చేసింది. టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీకి ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ డుప్లెసిస్ డకౌట్‌గా వెనుతిరగడం, మరో ఓపెనర్ కోహ్లీ కూడా 25 పరుగులకే వెనుతిరగడంతో ఆర్సీబీ కష్టాల్లో పడింది. అటు మరో స్టార్ ఆటగాడు మ్యాక్స్‌వెల్ కూడా 9 పరుగులకే అవుట్ అయ్యాడు.

Arjun Tendulkar: రంజీల్లోనూ అర్జున్ టెండూల్కర్‌కు నిరాశే..!!

అయితే బెంగళూరు భారీ స్కోరు చేయడంలో రజత్ పటీదార్ కీలక పాత్ర పోషించాడు. పటీదార్ ఐపీఎల్‌ కెరీర్‌లో తొలిసారిగా సెంచరీతో చెలరేగాడు. 54 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్సర్లతో 112 పరుగులతో తుదికంటా నాటౌట్‌గా నిలిచాడు. చివర్లో అతడికి దినేష్ కార్తీక్ కూడా అండగా నిలబడ్డాడు. దినేష్ కార్తీక్ 23 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్స్ సహాయంతో 37 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. దీంతో లక్నో ముందు 208 పరుగుల టార్గెట్ నిలిచింది. లక్నో బౌలర్లలో మోషిన్ ఖాన్, కృనాల్ పాండ్యా, అవేష్ ఖాన్, రవి బిష్ణోయ్ తలో వికెట్ సాధించారు.

 

Exit mobile version