Pak Cricket: మరోసారి పాకిస్తాన్ జట్టు పగ్గాలని తిరిగి బాబర్ ఆజంకు అప్పచెప్పిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు. వన్డే వరల్డ్‌కప్-2023లో ఘోర ప్రదర్శనకు బాధ్యత వహిస్తూ బాబర్ ఆజం అన్ని ఫార్మాట్లలో కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పాడు. ఈ క్రమంలో అప్పటి పీసీబీ ప్రెసిడెంట్ జకా అష్రఫ్.. పాక్ టెస్టు కెప్టెన్‌గా షాన్ మసూద్, టీ20 కెప్టెన్‌గా షాహీన్ అఫ్రిదికి బాధ్యతలు అప్పగించాడు.అయితే, కెప్టెన్సీలో మార్పులు చోటు చేసుకున్నాక పాకిస్తాన్ టీమ్ పరిస్థితి మరింత దారుణంగా మారింది. కొత్త కెప్టెన్‌లతో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పర్యటనలకు వెళ్లిన పాక్.. అక్కడ ఘోర ప్రదర్శన కనబరిచింది. మసూద్ నాయకత్వంలో పాక్.. ఆస్ట్రేలియా చేతిలో 3 టెస్టులు వైట్‌వాష్ కాగా, అఫ్రిది కెప్టెన్సీలో న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 4-1 తేడాతో చేజార్చుకుంది.
ఈ పేలవమైన ప్రదర్శనతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఫై విమర్శలు వెల్లువెత్తాయి. ఇక జనవరి నెలలో జకా అష్రఫ్ పీసీబీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకొవడంతో అష్రఫ్ స్ధానాన్ని మొహ్సిన్ నఖ్వీ భర్తీ చేశాడు.దీంతో పాక్ క్రికెట్‌ను తిరిగి గాడిలో పెట్టేందుకు, ఇక రానున్న టీ20 వరల్డ్ కప్ ద్రుష్టి లో పెట్టుకుని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు జట్టు సారథ్య బాధ్యతలను మళ్లీ బాబర్ ఆజంకే అప్పగించారు. త్వరలో పాకిస్థాన్ జట్టు స్వదేశంలో న్యూజిలాండ్ తో ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్ ఆడబోతుంది. ఈ సిరీస్ నుంచే తిరిగి పాకిస్తాన్ జట్టుకు కెప్టెన్ గా బాబర్ బాధ్యతలు చేపట్టబోతున్నాడు.