Site icon NTV Telugu

అందుకే నాకు అవకాశాలు రావడం లేదు : అక్షర్

ఐపీఎల్ 2020 తర్వాత టీం ఇండియా వెళ్లిన ఆస్ట్రేలియా పర్యటనలో స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా గాయపడటంతో భారత్‌ లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్‌ సిరీస్‌లో చోటు దక్కించుకున్న అక్షర్ పటేల్ 3 టెస్టుల్లో 27 వికెట్లు తీసి సత్తా చాటాడు. దాంతో డబ్ల్యూటీసీ ఫైనల్‌తో పాటు ఇంగ్లండ్‌తో జరగనున్న 5 టెస్ట్‌ల సిరీస్‌కు ఎంపికయ్యాడు. ప్రస్తుతం ఈ పర్యటన కోసం బీసీసీఐ ఏర్పాటు చేసిన క్వారంటైన్‌లో ఉన్న అక్షర్ పటేల్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… గాయాల కారణంగా వన్డేల్లో చోటు కోల్పోయాను. ఇక టెస్టుల్లో జడేజా, అశ్విన్‌ ఉన్నారు. అయిన జడేజా అద్భుతమైన ఆటతీరుతో మరో ఎడమచేతి వాటం ఆల్‌రౌండర్‌కు చోటు దొరకడం కష్టం అయ్యింది. ఇక మణికట్టు స్పిన్నర్లు వన్డేలో కుల్‌దీప్‌, చాహల్‌ రాణిస్తున్నారు. దాంతో జట్టు కూర్పు వల్లే నాకు చోటు దొరకలేదు. మళ్లీ ఇంగ్లాండ్ పైన అవకాశం దొరకగానే నిరూపించుకున్నా’ అని అక్షర్‌ తెలిపాడు.

Exit mobile version