NTV Telugu Site icon

IND vs AUS 2nd ODI: టీమిండియా ఘోర పరాజయం.. లక్ష్యాన్ని ఓపెనర్లే కొట్టేశారు

Australia Won

Australia Won

Australlia Won Vizag ODI Match Against India: విశాఖపట్నంలో జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో టీమిండియా ఘోర పరాజయం చవిచూసింది. భారత్ కుదిర్చిన 118 పరుగుల లక్ష్యాన్ని.. 11 ఓవర్లలేనే ఆస్ట్రేలియా కొట్టేసింది. ఒక్క వికెట్ కోల్పోకుండానే.. ఓపెనర్లే ఆ లక్ష్యాన్ని చేధించారు. భారత బౌలర్లు కనీసం ఒక్క వికెట్ కూడా తీయకుండా ఉసూరుమనిపించారు. ఆసీస్ బ్యాటర్లలో మిచెల్ మార్ష్ తాండవం చేశాడు. 33 బంతుల్లోనే 6 ఫోర్లు, 6 సిక్స్‌ల సహాయంతో 66 పరుగులు నమోదు చేశాడు. మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్ సైతం అర్థశతకం సాధించాడు. 30 బంతుల్లోనే 10 ఫోర్ల సహకారంతో 51 పరుగులు చేశాడు. భారత బ్యాటర్లు అపసోపాలు పడిన చోట ఈ ఇద్దరు ఓపెనర్లు బౌండరీల వర్షం కురిపించి.. 11 ఓవర్లలోనే మ్యాచ్‌ని ముగించేశారు.

Karnataka Crime Story: సినిమాను మించిన క్రైమ్ స్టోరీ.. ప్రియుడితో సహజీవనం.. 8 ఏళ్ల తర్వాత ట్విస్ట్

తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన భారత్.. 26 ఓవర్లలో 117 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఆస్ట్రేలియా బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ వేయగా.. టీమిండియా బ్యాటర్లు కనీసం పోరాట పటిమ కనబర్చలేకపోయారు. విరాట్ కోహ్లీ లాంటి స్టార్ బ్యాటరే 31 పరుగులతో హయ్యస్ట్ స్కోరర్‌గా నిలిచాడంటే.. మిగతా బ్యాటర్ల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అక్షర్ (29) కాస్త ఫర్వాలేదనిపించాడు. మిగలిన వాళ్లు మాత్రం తీవ్రంగా నిరాశపరిచారు. క్రీజులో అడుగుపెట్టినట్టే పెట్టి, పెవిలియన్ బాట పట్టారు. టీ20ల్లో అగ్రస్థానం కైవసం చేసుకున్న సూర్యకుమార్ యాదవ్ అయితే.. తొలి మ్యాచ్ తరహాలోనే ఇందులోనై గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. మొత్తం ఏడుగురు బ్యాటర్లు సింగిల్ డిజిట్‌కే పరిమితం అయితే.. అందులో నలుగురు డకౌట్ అయ్యారు. దీన్ని బట్టి.. టీమిండియా బ్యాటర్లు ఎంత చెత్త ప్రదర్శన కనబరిచారో అర్థం చేసుకోవచ్చు. ఆస్ట్రేలియా బౌలర్ల ధాటికి టీమిండియా పేకమేడల్లా కుప్పకూలింది.

Viral: తల్లి, అమ్మమ్మ, అత్త, కోడలు ఒకేసారి ప్రెగ్నెంట్ అయితే.. ?

ఇక 118 పరుగుల లక్ష్యంతో ఆస్ట్రేలియా బరిలోకి దిగినప్పుడు.. ప్రత్యర్థి బౌలర్ల తరహాలోనే ఇండియన్ బౌలర్లు కూడా విశ్వరూపం చూపిస్తారని మొదట్లో అనుకున్నారు. తీరా చూస్తే.. ఓపెనర్లే లక్ష్యాన్ని బాదేశారు. ఎడాపెడా బౌండరీల వర్షం కురిపించి.. 121 పరుగుల భాగస్వామ్యం జోడించి, తమ జట్టుని గెలిపించుకున్నారు. దీన్ని బట్టి.. పిచ్ ప్రభావం ఏమీ లేదని, భారత బ్యాటర్లే చేతులెత్తేశారని తేలిపోయింది. ఆస్ట్రేలియా ఈ అద్భుతమైన విజయం సాధించడంతో.. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ 1-1తో సమం అయ్యింది. ఇక చివరిదైన మూడో వన్డే ఈనెల 22న చెన్నైలో జరగనుంది. మరి, ఆ మ్యాచ్‌లో మన భారతీయులు ఎలా రాణిస్తారో చూడాలి.