Tim Paine Said: భారత వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ పైన ఆస్ట్రేలియా మాజీ టెస్ట్ కెప్టెన్ ‘టిమ్ పైన్’ సంచలన వ్యాఖ్యలు చేసాడు. బజ్ బాల్ అంటే ఇంగ్లాండ్ సృష్టించింది కాదు అని బజ్ బాల్ అని తెలియక ముందే ఇండియన్ బెటర్ ‘రిషబ్ పంత్’ పరిచయం చేసాడు అని పైన్ వ్యాఖ్యానించాడు . ఇప్పటి వరకు 129 మ్యాచ్‌లు ఆడిన పంత్.. 4123 పరుగులు సాధించాడు. వీటిలో అతడు వికెట్ కీపర్‌గా వ్యవహరిస్తూ.. 3651 రన్స్ (109 మ్యాచ్‌లు) నమోదు చేశాడు. ఇందులో ఆరు శతకాలతో పాటు 15 అర్థశతకాలున్నాయి. అగ్రస్థానంలో మాత్రం భారీ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఉన్నాడు. తన కెరీర్‌లో మొత్తం 535 మ్యాచ్‌లు ఆడిన ధోని.. ఓవరాల్‌గా 17092 పరుగులు సాధించాడు. వీటిలో 15 సెంచరీలు, 108 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
Also Read; Babar Azam: పాకిస్థాన్ కెప్టెన్‌గా బాబర్ ఆజం రీఎంట్రీ…
దీని తరువాత 2022 డిసెంబర్ మాసంలో రిషబ్ పంత్ ఘోర రోడ్డు ప్రమాదంకు గురైన విషయం తెలిసిందే. కారు యాక్సిడెంట్‌లో బ్రతికి బయటపడిన పంత్.. మోకాలికి సర్జరీ చేయించుకున్నాడు. అనంతరం ఎన్‌సీఏలో పునరావాసం పొందాడు. ఎన్‌సీఏ వైద్య బృందం సమక్షంలో కఠినమైన వ్యాయామాలు చేసి ఫిట్‌నెస్ సాధించాడు. ఎన్‌సీఏలో బ్యాటింగ్, వికెట్ కీపింగ్ ప్రాక్టీస్ చేస్తు. పంత్ ఫిట్‌నెస్ సాధించిడు.. ప్రస్తుతం పంత్ ఐపీఎల్ 2024లో ఢిల్లీ క్యాప్టిల్స్ జట్టు ని లీడ్ చేస్తూ రీఎంట్రీ ఇచ్చాడు. ఈ ఏడాది నవంబర్ 22 నుంచి ఇండియా- ఆస్ట్రేలియా మధ్య జరిగే ఐదు టెస్టు మ్యాచ్ల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సిరీస్ జరుగనుంది. ప్రారంభం కానుంది. ఈ మేరకు క్రికెట్ ఆస్ట్రేలియా(CA) బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25కు సంబంధించిన షెడ్యూల్ ఈరోజు విడుదల చేసింది. ఈ సిరీస్ కి ముందు పంత్ పూర్తి ఫిట్నెస్ తో జట్టు లోకి రావాలి అని ఫాన్స్ ఆశిస్తున్నారు.