Site icon NTV Telugu

IND Vs AUS: తొలి టీ20లో పంత్‌ను పక్కనపెట్టిన టీమిండియా.. తుది జట్టు ఇదే..!!

Ind Vs Aus

Ind Vs Aus

మొహాలీ వేదికగా టీమిండియాతో జరుగుతున్న తొలి టీ20లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆశ్చర్యకరంగా బుమ్రాను తుది జట్టులోకి తీసుకోకుండా ఉమేష్ యాదవ్‌కు అవకాశం ఇచ్చింది. అటు వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్ బదులు దినేష్ కార్తీక్‌ను జట్టులోకి తీసుకుంది. ఆల్‌రౌండర్ కోటాలో దీపక్ హుడా బదులు అక్షర్ పటేల్‌కు అవకాశం కల్పించింది. రోహిత్, కేఎల్ రాహుల్ ఓపెనింగ్‌కు రానున్నారు. కాగా రానున్న టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ గెలవడం టీమిండియాకు ప్రతిష్టాత్మకంగా మారింది.

తుది జట్లు
భారత్: రోహిత్ (కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దినేష్ కార్తీక్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, చాహల్, భువనేశ్వర్, ఉమేష్ యాదవ్, హర్షల్ పటేల్
ఆస్ట్రేలియా జట్టు: ఫించ్, గ్రీన్, స్టీవ్ స్మిత్, మ్యాక్స్‌వెల్, జోష్, టిమ్ డేవిడ్, మథ్యూ వేడ్, కమ్మిన్స్, నాథన్ ఎలిస్, ఆడం జంపా, హేజిల్‌వుడ్

Exit mobile version