NTV Telugu Site icon

Women World T20: మరోసారి సత్తా చాటిన ఆస్ట్రేలియా.. ఫైనల్స్‌లో దక్షిణాఫ్రికాపై విజయం

Ausw Vs Saw

Ausw Vs Saw

Australia Women Team Clinch Trophy For Sixth Time: మహిళల టీ20 వరల్డ్‌కప్‌ ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజయఢంకా మోగించింది. దక్షిణాఫ్రికాపై 19 పరుగుల తేడాతో విజయం సాధించి, కప్‌ను కైవసం చేసుకుంది. ఫలితంగా.. 2018, 2020 టీ20 వరల్డ్‌కప్‌ల తర్వాత మూడోసారి మెగాట్రోఫీ నెగ్గి, ఆసీస్ జట్టు హ్యాట్రిక్ కొట్టింది. తొలుత టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంపిక చేసుకున్న ఆస్ట్రేలియా జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. ఓపెనర్ మూనీ (74), గార్చర్ (29) బాగా రాణించడంతో.. ఆసీస్ జట్టు గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. మిగతా బ్యాటర్లెవ్వరూ పెద్దగా సత్తా చాటలేకపోయారు. హీలే(18), గ్రేస్‌ హారిస్‌(10), కెప్టెన్‌ లానింగ్‌(10) తక్కువ స్కోర్లతో నిరాశపరిచారు.

Medico Preethi : పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి మృతి

అనంతరం 157 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా జట్టు.. 17 పరుగుల వద్దే తొలి వికెట్ కోల్పోయింది. దీంతో.. వికెట్లను కాపాడుకోవడం కోసం ఆ జట్టు మెల్లగా ఆడింది. ఈ దెబ్బకు రన్ రేట్ పెరిగిపోతూ వచ్చింది. 10 ఓవర్లు ముగిసేసరికి.. దక్షిణాఫ్రికా జట్టు రెండు వికెట్లు కోల్పోయి కేవలం 52 పరుగులే చేసింది. అంటే.. మరో 10 ఓవర్లలో టార్గెట్ 105 పరుగులన్నమాట! ఇది దక్షిణాఫ్రికా జట్టుకి పెద్ద సవాలుగా మారింది. అప్పటినుంచి దక్షిణాఫ్రికా కోలుకోలేకపోయింది. దక్షిణాఫ్రికా ఓపెనర్‌ లౌరా(61) ఒక్కతే ఒంటరి పోరాటం చేసింది. ఆమెకు ఇతర బ్యాటర్లు సహకరించి ఉంటే, బహుశా సపారీలు గెలిచేవారేమో! కానీ, ఆమెకు ఎవ్వరూ తోడు ఇవ్వకపోవడంతో.. ఆరు వికెట్ల నష్టానికి 137 పరుగులకే దక్షిణాఫ్రికా జట్టు పరిమితమైంది. దీంతో.. 19 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.

Minister KTR: మనీష్ సిసోడియా అరెస్టు అప్రజాస్వామికం.. కేటీఆర్ ఫైర్

కాగా.. ఆస్ట్రేలియా మహిళల జట్టుకి ఇది ఆరో వరల్డ్‌కప్ కాగా, రెండోసారి హ్యాట్రిక్ సొంతం చేసుకుంది. గతంలో 2010, 2012, 2014 టీ20 వరల్డ్‌కప్‌లను ఆసీస్ జట్టు కైవసం చేసుకుంది. ఆ తర్వాత 2018, 2020, 2023 టీ20 వరల్డ్‌కప్‌లను వరుసగా సాధించింది. ఈ మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా బెత్ మూనీ, ప్లేయర్ ఆఫ్ ద సిరీస్‌గా ఆస్లె హై గార్డెనర్ ఎంపికయ్యారు.