Site icon NTV Telugu

యాషెస్ తొలి టెస్ట్… తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌కు భారీ ఆధిక్యం

travis head

యాషెస్ సిరీస్‌లో భాగంగా తొలి టెస్టులో ఆస్ట్రేలియా ఆధిపత్యం కొనసాగుతోంది. బ్రిస్బేన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న యాషెస్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో మూడో రోజు ఉదయం సెషన్‌లో ఆస్ట్రేలియా 425 పరుగులకు ఆలౌటైంది. ట్రావిస్ హెడ్ 152 పరుగులతో భారీ సెంచరీ సాధించాడు. ఓపెనర్ వార్నర్ 94, లబుషేన్ 74, స్టార్క్ 35 పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో రాబిన్‌సన్, మార్క్‌వుడ్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. క్రిస్ వోక్స్ 2 వికెట్లు తీశాడు. లీచ్, రూట్ చెరో వికెట్ దక్కించుకున్నారు. కాగా ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 278 పరుగుల భారీ ఆధిక్యం సంపాదించింది. ఆసీస్ బౌలర్ల ధాటికి ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 147 పరుగులకే ఆలౌటైంది. ఇంకా రెండు రోజుల ఆట మిగిలి ఉండటంతో ఇంగ్లండ్ జట్టుకు భారీ ఓటమి తప్పకపోవచ్చని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Read Also: నిల‌క‌డగా బంగారం, త‌గ్గిన వెండి ధ‌ర‌లు

Exit mobile version