Site icon NTV Telugu

IND vs PAK: భారత్- పాక్ మ్యాచ్ లో ప్లేయర్ల మధ్య గొడవ.. రెచ్చిపోయిన అభిషేక్!

Abhi

Abhi

IND vs PAK: భారత్ – పాక్ మధ్య జరిగిన హై వోల్టేజ్ మ్యాచ్ ఉద్రిక్తతకు దారి తీసింది. హ్యాండ్ షేక్ వివాదం తర్వాత జరిగిన ఈ మ్యాచ్ లో భారత్ బ్యాటింగ్ చేసే సమయంలో పాక్ ఆటగాళ్లు రెచ్చగొట్టే విధానంతో మరింత హీటెక్కి పోయింది. దాయాది జట్టు బౌలర్ల కవ్వింపు చర్యలకు టీమిండియా తమ బ్యాట్‌తోనే ఆన్సర్ ఇచ్చి పడేసింది. భారత్ బ్యాటింగ్ ప్రారంభించిన మొదటి బంతి నుంచే పాక్ బౌలర్లు రెచ్చగొట్టడానికి ట్రై చేశారు. ముఖ్యంగా అభిషేక్ శర్మని లక్ష్యంగా చేసుకుని పాకిస్థాన్ పేసర్లు షాహీన్ షా అఫ్రిది, హారీస్ రౌఫ్ దగ్గరకొచ్చి మరీ గొడవ పెట్టుకున్నారు. తొలి బంతికే సిక్సర్ కొట్టిన అభిషేక్ శర్మ .. షాహీన్ షా ఏదో అనడంతో ఛల్ అంటూ ఇచ్చిపడేశాడు. ఆ తర్వాత హారీస్ రౌఫ్ ఇంకాస్త దూకుడు ప్రదర్శిస్తూ తన మాటలతో రెచ్చగొట్టాడు.

Read Also: Sharan Navaratri Day 1: నేటి నుంచి ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు.. బాలా త్రిపుర సుందరీ దేవిగా దర్శనం..

ఇక, పవర్ ప్లేలో హారీస్ రౌఫ్ వేసిన ఓవర్‌‌లో వైస్ కెప్టెన్ శుభమన్ గిల్ వరుస బౌండరీలతో స్కోర్ బోర్డును ఉరుకులు పరుగులు పెట్టించాడు. అప్పుడు, నాన్ స్ట్రయిక్‌లో ఉన్న అభిషేక్‌ శర్మతో హారీస్ రౌఫ్ గొడవకు దిగాడు. దాంతో అభిషేక్ కూడా అదే స్థాయిలో అతడికి గట్టిగా సమాధానం చెప్పాడు. కాగా ఫీల్డ్ అంపైర్లు మధ్యలోకి వచ్చి వారిద్దరిని వారించడంతో వాగ్వాదం సద్దుమణిగింది. అయితే, ఆసియా కప్ 2025 సూపర్-4లో భారత్ – పాక్ మధ్య జరిగిన మ్యాచ్ రసవత్తరంగా కొనసాగింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా పాక్‌ను బ్యాటింగ్‌కి అవకాశం ఇచ్చింది. టీమిండియా ఫీల్డింగ్ మిస్టేక్‌తో క్యాచ్‌లు మిస్ చేయడంతో పాకిస్థాన్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 171 రన్స్ చేసింది.

Read Also: Astrology: సెప్టెంబర్‌ 22, సోమవారం దినఫలాలు.. ఏ రాశి వారు ఏ పరిహారం చెల్లించాలి..?

అయితే, పాక్ ఇచ్చిన టార్గెట్‌ ఛేజింగ్‌తో బ్యాటింగ్ కి వచ్చిన టీమిండియాకు ఓపెనర్లు శుభారంభం ఇచ్చారు. శుభమన్ గిల్, అభిషేక్ శర్మ తొలి వికెట్‌కు 9.5 ఓవర్లలోనే ఏకంగా 105 రన్స్ భాగస్వామ్యం నెలకొల్పారు. శుభమన్ గిల్ (28 బంతుల్లో 8 ఫోర్లు) 47 పరుగులు చేయగా, ఆ తర్వాత కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ డకౌట్ అయ్యాడు. ఇక, అభిషేక్ శర్మ (39 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్ల) 74 పరుగులు చేయగా, సంజూ శాంసన్ 17 బంతుల్లో కేవలం 13 పరుగులు చేసి మరోసారి నిరాశ పరిచాడు. ఆఖర్లో తిలక్ వర్మ 19 బంతుల్లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లతో 30 రన్స్ చేయడంతో భారత్ 18.5 ఓవర్లలో టార్గెట్ చేధించడంతో 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

Exit mobile version