Site icon NTV Telugu

Team India New Jersey: టీమిండియాకు నో స్పాన్సర్‌.. కొత్త జెర్సీ ఇదే..

Team India

Team India

Team India New Jersey: ఆసియా కప్ టోర్నీ మరో మూడు రోజుల్లో ప్రారంభం కానుంది. అయితే, ఈ మెగా ఈవెంట్‌లో టీమిండియా ప్లేయర్స్ స్పాన్సర్‌షిప్ లేకుండానే గ్రౌండ్ లోకి అడుగు పెట్టబోతున్నారు. ఈ టోర్నమెంట్లో ఆడే భారత జట్టు జెర్సీపై ఎలాంటి ప్రధాన స్పాన్సర్ పేరు కనిపించడం లేదు. కొత్త స్పాన్సర్ ఎంపిక ప్రక్రియ ఇప్పటి వరకు పూర్తికాకపోవడమే దీనికి ప్రధాన కారణం అని చెప్పాలి. అయితే, బీసీసీఐ ప్రస్తుతం టీమిండియా కొత్త జెర్సీ స్పాన్సర్ కోసం వేట కొనసాగిస్తుంది. ఇందుకోసం ఇంట్రెస్ట్ ఉన్న కంపెనీల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తుంది. కానీ, ఈ బిడ్డింగ్ ప్రక్రియ పూర్తి కావడానికి మరికొంత సమయం పట్టే ఛాన్స్ ఉండటంతో, ఆసియా కప్ తర్వాతే కొత్త స్పాన్సర్‌పై తుది నిర్ణయం వెలువడనుంది. అప్లికేషన్స్ సమర్పించడానికి సెప్టెంబర్ 16ను చివరి తేదీగా ఫిక్స్ చేశారు.

Read Also: Charminar : ట్యాంక్‌బండ్ కు తరలివస్తున్న భారీ గణనాథులు

అయితే, బీసీసీఐ ఈసారి జెర్సీ స్పాన్సర్‌షిప్ ధరలను భారీగా పెంచినట్లు సమాచారం. రాబోయే మూడేళ్లలో ఈ కాంట్రాక్టుల ద్వారా రూ. 400 కోట్లకు పైగా ఆదాయం ఆర్జించాలని టార్గెట్ గా పెట్టుకుంది. దీని ప్రకారం, ద్వైపాక్షిక సిరీస్‌లలో ఒక్కో మ్యాచ్‌కు రూ. 3.5 కోట్లు, ఐసీసీ లేదా ఆసియా కప్ లాంటి టోర్నమెంట్లలో మ్యాచ్‌కు రూ. 1.5 కోట్లుగా ధరను ఫిక్స్ చేసినట్లు టాక్. గతంలో జెర్సీ స్పాన్సర్‌షిప్ ధరలు వరుసగా రూ. 3.17 కోట్లు, రూ. 1.12 కోట్లుగా ఉన్నాయి. ఇక, ద్వైపాక్షిక సిరీస్‌లకు, ఐసీసీ టోర్నీలకు ధరలో తేడా ఉండటానికి ప్రధాన కారణం ఉంది. ద్వైపాక్షిక మ్యాచ్‌లలో స్పాన్సర్ పేరు జెర్సీ ముందు భాగంలో క్లియర్ గా కనిపిస్తుంది. కానీ, ఐసీసీ నిబంధనల ప్రకారం ప్రపంచ కప్ లాంటి టోర్నీలలో స్పాన్సర్ పేరును అలా ప్రదర్శించడానికి అవకాశం లేదు. అందుకే ఆ మ్యాచ్‌లకు తక్కు ధరను నిర్ణయించారు.

Read Also: Vizag: ఇన్‌స్టా‌గ్రామ్‌లో యువతి పోస్ట్ చేసిన ఫోటో మార్పింగ్ చేసిన యువకుడు.. ఆ తర్వాత ఏమైందంటే…

ఇక, కొత్త స్పాన్సర్‌షిప్ కోసం బీసీసీఐ మరికొన్ని కఠిన రూల్స్ విధించింది. బిడ్డింగ్‌లో పాల్గొనే కంపెనీలకు బెట్టింగ్, ఆన్‌లైన్ గేమింగ్, గ్యాంబ్లింగ్‌తో ఎలాంటి సంబంధం ఉండొద్దని తేల్చి చెప్పింది. అలాగే, సెప్టెంబర్ 9వ తేదీన ప్రారంభం కానున్న ఆసియా కప్‌లో భారత్ తన తొలి మ్యాచ్‌ను సెప్టెంబర్ 10న యూఏఈతో ఆడబోతుంది. ఆ తర్వాత సెప్టెంబర్ 14వ తేదీన పాకిస్థాన్‌తో, సెప్టెంబర్ 19న ఒమన్‌తో పోటీ పడనుంది. ఈ మ్యాచ్‌లన్నికి టీమిండియా స్పాన్సర్ లోగో లేకుండానే బరిలోకి దిగుతుంది.

Exit mobile version