Asia Cup Final 2022 Match: ఆసియా కప్ తుది సమరం ఈ రోజు జరగబోతోంది. పాకిస్తాన్, శ్రీలంక జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా రాత్రి 7.30 గంటకు మ్యాచ్ ప్రారంభం కానుంది. టోర్నీలో సూపర్ ఫోర్ దశలో ఇరు జట్లు తొలి రెండు స్థానాల్లో నిలిచి ఫైనల్స్ కు చేరాయి. సూపర్ 4లో శ్రీలంక మొత్తం మూడు మ్యాచుల్లో గెలవగా.. పాకిస్తాన్ రెండు మ్యాచుల్లో గెలిచింది. ఇక ఈ సారి ఆసియా కప్ ఎవరు గెలుచుకుంటారో చూడాలి. ఇప్పటి వరకు పాకిస్తాన్ రెండు సార్లు ఆసియా కప్ గెలవగా.. శ్రీలంక ఐదు సార్లు కప్ గెలుచుకుంది.
ఇరు జట్లు కూడా ఇటు బ్యాటింగ్, అటు బౌలింగ్ పరంగా బలంగా కనిపిస్తున్నాయి. శ్రీలంక జట్టు ఇటు ఇండియాపైన, అటు పాకిస్తాన్ పైన సత్తా చాటారు. పాకిస్తాన్ తో పోలిస్తే శ్రీలంక జట్టుదే అప్పర్ హ్యండ్ గా కనిపిస్తోంది. ఇరు జట్లలో మ్యాచ్ విన్నర్లకు కొదవలేదు. శ్రీలంకలో . కుశాల్ మెండిస్, నిశాంక, రాజపక్స, శానక దూకుడుగా ఆడుతున్నారు. టోర్నీ మొదటి మ్యాచులో ఆప్ఘనిస్తాన్ చేతిలో ఘోర పరాజయం చూసిన తర్వాత.. ఆ జట్టు పుంజుకున్న తీరు అద్భుతం.. ఇదే దూకుడు మంత్రంగా వరసగా ఇండియా, పాకిస్తాన్ జట్లను ఓడించింది. భారత్ తో జరిగిన మ్యాచులో తమ బ్యాటింగ్ ఎలా ఉందో రుచి చూపిస్తే.. పాకిస్తాన్ మ్యాచ్ లో బౌలింగ్ తో అదరగొట్టింది.
Read Also: Weather Report Telangana: అలర్ట్.. మరో మూడు రోజులు అతిభారీ వర్షాలు
ఇక పాకిస్తాన్ జట్టు కూడా ఇటు బ్యాటింగ్ అటు బౌలింగ్ తో పటిష్టంగా కనిపిస్తోంది. పేస్‌లో నసీమ్ షా, రవూఫ్, హస్నైన్.. స్పిన్‌లో షాదాబ్, నవాజ్ సూపర్ గా ఆడుతున్నారు. మరోవైపు పాక్ స్టార్ క్రికెటర్ బాబార్ అజామ్ నుంచి ఆసియా కప్ టోర్నీలో పెద్ద ఇన్నింగ్స్ చూడలేదు. పాక్ ఆశలన్నీ యువ సంచలనం ఓపెనర్ రిజ్వాన్ పైనే పెట్టుకుంది. ఇక పఖర్ జమాన్, ఖుష్‌దిల్ షా, షాదాబ్, అసిఫ్ అలీ, నవాజ్ కీలకం కానున్నారు.
జట్ల అంచానా:
పాకిస్థాన్: మహ్మద్ రిజ్వాన్, బాబర్ ఆజం, ఫఖర్ జమాన్, ఇఫ్తీకర్ అహ్మద్, ఖుష్దిల్ షా, ఆసిఫ్ అలీ, మహ్మద్ నవాజ్, షాదాబ్ ఖాన్, నసీమ్ షా, హరీస్ రవూఫ్, మహ్మద్ హస్నైన్.
శ్రీలంక: పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్, ధనంజయ డి సిల్వా, దనుష్క గుణతిలక, భానుక రాజపక్స, దసున్ షనక, వనిందు హసరంగా, చమిక కరుణరత్నే, ప్రమోద్ మదుషన్, మహేశ్ తీక్షణ, దిల్షన్ మధుశంక.
