Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Asia Cup Asia Cup 2022 Schedule Released And India Will Face Pakistan On 28th August

Asia Cup 2022: క్రికెట్ అభిమానులకు శుభవార్త.. ఆసియా కప్ షెడ్యూల్ విడుదల

Published Date :August 2, 2022 , 5:12 pm
By Mahesh Jakki
Asia Cup 2022: క్రికెట్ అభిమానులకు శుభవార్త.. ఆసియా కప్ షెడ్యూల్ విడుదల
  • Follow Us :
  • google news
  • dailyhunt

Asia Cup 2022: క్రికెట్ ఫ్యాన్స్‌ను అలరించేందుకు మరో టోర్నీ సిద్దమైంది. టీ20 ఫార్మాట్‌లో జరిగే ఆసియాకప్ మనముందుకు రాబోతుంది. దీనికి సంబంధించి ఏసీసీ(ఏసియన్ క్రికెట్ కౌన్సిల్) షెడ్యూల్‌ను విడుదల చేసింది. యూఏఈ వేదికగా ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 11 మధ్య ఈ టోర్నమెంట్ జరగనుంది. మొత్తం ఆరు జట్లు ఇందులో పాల్గొంటున్నాయి. భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌లతో పాటు మరో క్వాలిఫయర్ జట్టు ఈ మెగా టోర్నీలో పాల్గొననుంది. ఆరో బెర్త్‌ కోసం హాంకాంగ్, సింగపూర్, కువైట్, యూఏఈలు క్వాలిఫికేషన్ రౌండ్‌లో తలపడనున్నాయి. సెప్టెంబర్‌ 11న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. దాయాది దేశం పాకిస్థాన్‌తో క్రికెట్ మ్యాచ్ అంటే క్రికెట్‌ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. పాక్, భారత అభిమానులే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌ను చూస్తారంటే అతిశయోక్తి లేదు. ఆసియా కప్‌లో భాగంగా భారత్ ఈ నెల 28న పాక్‌తో తలపడనుంది.

వాస్తవానికి 2020లోనే శ్రీలంక వేదికగా ఆసియా కప్ జరగాల్సి ఉంది. అయితే కరోనా వల్ల 2022కి వాయిదా పడింది. అయితే తమ దేశంలోతలెత్తిన ఆర్థిక సంక్షోభం వల్ల తాము ఆసియా కప్‌ను నిర్వహించలేమని శ్రీలంక క్రికెట్ బోర్డు చేతులెత్తేసింది. దాంతో ఆసియా కప్‌ను యూఏఈకి తరలించారు. రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత్ ఆగస్టు 28న దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో బాబర్ అజామ్ నేతృత్వంలోని పాకిస్థాన్‌తో సాయంత్రం తలపడుతుందని ఏసీసీ ప్రెసిడెంట్ జే షా టోర్నమెంట్ పూర్తి షెడ్యూల్‌ను ప్రకటించినప్పుడు ధ్రువీకరించారు. ఈ మెగా ఈవెంట్ ఆగస్టు 27న శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ మధ్య మ్యాచ్‌తో ప్రారంభమవుతుంది.

Indian Army: ఆర్మీలో ఖాళీలపై కేంద్రం ప్రకటన.. డిసెంబర్ 2023 నాటికి భర్తీ..

మూడో మ్యాచ్ ఆగస్టు 29న బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరగనుండగా, టోర్నమెంట్‌లో భారత్ తన రెండవ మ్యాచ్‌ని ఆగస్టు 30న ఇంకా నిర్ణయించని క్వాలిఫయర్‌తో ఆడుతుంది. టోర్నీ ఫైనల్ సెప్టెంబర్ 11న దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనుంది.

Asia Cup Schedule

Asia Cup Schedule

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • asia cup
  • asia cup 2022
  • Asia Cup 2022 schedule
  • Asia Cup 2022 schedule released
  • india vs pakistan match in asia cup

తాజావార్తలు

  • Kunki Choudhury: సీఎం హిమంత బిస్వ శర్మను సవాలు చేస్తున్న 27 ఏళ్ల ‘జెన్‌ జీ’ అభ్యర్థి.. కుంకీ చౌదరి ఎవరు?

  • Uppal Stadium: ఉప్పల్ స్టేడియం వద్ద ఫ్యాన్స్ ఆందోళన.. సిబ్బందిపై ఆగ్రహం..

  • Rini Sampath: వాషింగ్టన్ గడ్డపై చరిత్ర సృష్టించనున్న ఇండియన్ లేడీ.. ఎవరీ రిని సంపత్?

  • SRH Vs LSG: సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్.. జట్టులోకి మరో విధ్వంసకర బ్యాటర్..

  • Train Coach: పెళ్లి కోసం ఏకంగా రైలు కోచ్ మొత్తాన్ని బుక్ చేసుకున్న కుటుంబం.. ఇలా బుక్ చేసుకునే వీలుందా?

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions