Asia Cup 2022: క్రికెట్ ఫ్యాన్స్‌ను అలరించేందుకు మరో టోర్నీ సిద్దమైంది. టీ20 ఫార్మాట్‌లో జరిగే ఆసియాకప్ మనముందుకు రాబోతుంది. దీనికి సంబంధించి ఏసీసీ(ఏసియన్ క్రికెట్ కౌన్సిల్) షెడ్యూల్‌ను విడుదల చేసింది. యూఏఈ వేదికగా ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 11 మధ్య ఈ టోర్నమెంట్ జరగనుంది. మొత్తం ఆరు జట్లు ఇందులో పాల్గొంటున్నాయి. భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌లతో పాటు మరో క్వాలిఫయర్ జట్టు ఈ మెగా టోర్నీలో పాల్గొననుంది. ఆరో బెర్త్ కోసం హాంకాంగ్, సింగపూర్, కువైట్, యూఏఈలు క్వాలిఫికేషన్ రౌండ్‌లో తలపడనున్నాయి. సెప్టెంబర్ 11న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. దాయాది దేశం పాకిస్థాన్‌తో క్రికెట్ మ్యాచ్ అంటే క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. పాక్, భారత అభిమానులే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌ను చూస్తారంటే అతిశయోక్తి లేదు. ఆసియా కప్‌లో భాగంగా భారత్ ఈ నెల 28న పాక్‌తో తలపడనుంది.
వాస్తవానికి 2020లోనే శ్రీలంక వేదికగా ఆసియా కప్ జరగాల్సి ఉంది. అయితే కరోనా వల్ల 2022కి వాయిదా పడింది. అయితే తమ దేశంలోతలెత్తిన ఆర్థిక సంక్షోభం వల్ల తాము ఆసియా కప్‌ను నిర్వహించలేమని శ్రీలంక క్రికెట్ బోర్డు చేతులెత్తేసింది. దాంతో ఆసియా కప్‌ను యూఏఈకి తరలించారు. రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత్ ఆగస్టు 28న దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో బాబర్ అజామ్ నేతృత్వంలోని పాకిస్థాన్‌తో సాయంత్రం తలపడుతుందని ఏసీసీ ప్రెసిడెంట్ జే షా టోర్నమెంట్ పూర్తి షెడ్యూల్‌ను ప్రకటించినప్పుడు ధ్రువీకరించారు. ఈ మెగా ఈవెంట్ ఆగస్టు 27న శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ మధ్య మ్యాచ్‌తో ప్రారంభమవుతుంది.
Indian Army: ఆర్మీలో ఖాళీలపై కేంద్రం ప్రకటన.. డిసెంబర్ 2023 నాటికి భర్తీ..
మూడో మ్యాచ్ ఆగస్టు 29న బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరగనుండగా, టోర్నమెంట్‌లో భారత్ తన రెండవ మ్యాచ్‌ని ఆగస్టు 30న ఇంకా నిర్ణయించని క్వాలిఫయర్‌తో ఆడుతుంది. టోర్నీ ఫైనల్ సెప్టెంబర్ 11న దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనుంది.
Asia Cup Schedule