Arshdeep Singh History: ప్రపంచ రికార్డు సృష్టించిన అర్ష్‌దీప్‌ సింగ్‌.. మరో వికెట్ తీస్తే తోపే!

Arshdeep Singh History

Arshdeep Singh History

Arshdeep Singh World Record: టీమిండియా స్టార్‌ పేసర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌ అంతర్జాతీయ టీ20క్రికెట్‌లో సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు. న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20లో అర్ష్‌దీప్‌ ఒక వికెట్‌ పడగొట్టాడు. దీంతో 2026 క్యాలెండర్‌ ఇయర్‌లో అతడి వికెట్ల సంఖ్య 39కి చేరింది. ఫలితంగా ఒక క్యాలెండర్‌ ఏడాదిలో టెస్టు హోదా కలిగిన దేశాల తరఫున అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో అర్ష్‌దీప్‌ సంయుక్తంగా అగ్రస్థానానికి చేరాడు. ఐర్లాండ్‌ పేసర్‌, మాజీ గుజరాత్‌ టైటాన్స్‌ ఆటగాడు జోషువా లిటిల్‌ 2022లో 39 వికెట్లు తీసి ఈ రికార్డును నెలకొల్పాడు. ఇప్పుడు అర్ష్‌దీప్‌ అతడి సరసన నిలిచాడు.

అగ్రస్థానం పక్కా:


న్యూజిలాండ్‌తో మూడో టీ20లో అర్ష్‌దీప్‌ సింగ్‌ తన నాలుగు ఓవర్ల కోటాలో 33 పరుగులు ఇచ్చి ఒక వికెట్‌ తీశాడు. ఈ వికెట్‌తో 2026లో అతడి అంతర్జాతీయ టీ20 వికెట్ల సంఖ్య 39కి చేరింది. దీంతో ఒకే క్యాలెండర్‌ ఏడాదిలో టెస్టు హోదా కలిగిన దేశానికి చెందిన బౌలర్‌ అత్యధిక వికెట్లు తీసిన రికార్డును జోషువా లిటిల్‌తో కలిసి పంచుకున్నాడు. 2022లో ఐర్లాండ్‌ తరఫున జోషువా 39 వికెట్లు పడగొట్టాడు. ఇప్పుడు అర్ష్‌దీప్‌ కూడా అన్నే వికెట్లు తీసి తన బౌలింగ్‌ సత్తాను చాటాడు. న్యూజిలాండ్‌తో ఇంకా రెండు మ్యాచ్‌లు ఉండటంతో అర్ష్‌దీప్‌ ఈ రికార్డును తన పేరిట సొంతం సొంతం చేసుకోవడం పక్కా.

మరో వికెట్:
అర్ష్‌దీప్‌ సింగ్‌ 2022లో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. అప్పటి నుంచి భారత బౌలింగ్‌ విభాగంలో కీలక ఆటగాడిగా ఎదిగాడు. ఇప్పటివరకు 102 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి 149 వికెట్లు పడగొట్టాడు. ఓ వికెట్‌ తీస్తే అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో 150 వికెట్ల మైలురాయిని చేరుకుంటాడు. ప్రస్తుతం టీ20ల్లో భారత్‌ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా కూడా అర్ష్‌దీప్‌ కొనసాగుతున్నాడు. జస్ప్రీత్ బుమ్రా 126 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఇక న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లోనూ అర్ష్‌దీప్‌ నిలకడగా రాణిస్తున్నాడు. తొలి మ్యాచ్‌లో ఒక వికెట్‌ తీసిన అతడు.. రెండో టీ20లో రెండు వికెట్లు పడగొట్టాడు. మూడో మ్యాచ్‌లో మరో వికెట్‌ సాధించడంతో ఈ సిరీస్‌లో అతడి వికెట్ల సంఖ్య నాలుగుకు చేరింది.

అంతర్జాతీయ టీ20ల్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు:
అర్ష్‌దీప్‌ సింగ్‌: 149 వికెట్లు (102 మ్యాచ్‌లు)
జస్ప్రీత్ బుమ్రా: 126 వికెట్లు (100 మ్యాచ్‌లు)
అక్షర్ పటేల్: 115 వికెట్లు (115 మ్యాచ్‌లు)
హార్దిక్ పాండ్యా: 114 వికెట్లు (138 మ్యాచ్‌లు)
యుజ్వేంద్ర చహల్: 96 వికెట్లు (80 మ్యాచ్‌లు)