NTV Telugu Site icon

Arjun Tendulkar: ఆమెతో సచిన్ తనయుడు.. వైరలవుతున్న ఫోటోలు

Arjun With Danielle Wyatt

Arjun With Danielle Wyatt

సెలెబ్రిటీ స్టేటస్ ఉన్నవారు ఎవరితోనైనా కాస్త సన్నిహితంగా మెలిగినా, కనీసం కలిసి ఫోటో దిగినా.. ఆ ఇద్దరి మధ్య ఏవో పప్పులు ఉడుకుతున్నాయనే రూమర్లు పుట్టుకొచ్చేస్తాయి. ఇప్పుడు క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ తనయుడు అర్జున్ టెండూల్కర్‌పై అలాంటి రూమర్లే తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఇంగ్లండ్ మహిళా క్రికెటర్‌ డేనియల్ వ్యాట్‌తో అతను సన్నిహితంగా ఉన్న ఫొటో ఒకటి నెట్టింట్లో దర్శనమిచ్చింది. అందులో అర్జున్, వ్యాట్ కాస్త చనువుగా ఉండటాన్ని గమనించవచ్చు. అంతే, అది చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. మనోడు ఇంగ్లీష్ పిల్ల బుట్టలో పడ్డాడంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

అయితే.. వాస్తవానికి వ్యాట్ ఎప్పట్నుంచో సచిన్ ఫ్యామిలీతో సన్నిహితంగానే ఉంటూ వస్తోంది. సచిన్‌కు వీరాభిమాని అయిన ఆమె.. 2009 నుంచే తనకు సచిన్, అర్జున్‌లో పరిచయం ఉందని గతంలో పలు సందర్భాల్లో వెల్లడించింది కూడా! లార్డ్స్ మైదానికి సచిన్ పిల్లలు ఎప్పుడూ వచ్చినా, వారిని ఆమె తప్పకుండా కలిసేది. అంటే, ఆమెకు సచిన్ కుటుంబంతో మంచి స్నేహబంధం ఉందన్నమాట! ఈ క్రమంలోనే అప్పుడప్పుడు ఆమె సచిన్ పిల్లల్ని కలవడం సాధారణం. ఇప్పుడు కూడా అలాగే క్యాజువల్‌గా అర్జున్, వ్యాట్ కలిసి ఉంటారని.. ఈ సందర్భంగా వాళ్లు కలిసి ఫోటో తీసుకొని ఉండొచ్చని మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా.. అర్జున్, వ్యాట్‌ల ఫోటో మాత్రం తాజాగా నెట్టింట్లో హాట్ టాపిక్‌గా మారింది.

ఇదిలావుండగా.. 31 ఏళ్ల వ్యాట్‌ ఇంగ్లండ్‌ తరఫున 93 వన్డేలు, 124 టీ20 మ్యాచ్‌లు ఆడింది. ఆ రెండు ఫార్మాట్స్‌లో కలిపి ఆమె తన కెరీర్ మొత్తంలో 4 సెంచరీలు, 12 హాఫ్‌ సెంచరీల సాయంతో 3400కు పైగా పరుగులు చేసింది. హాఫ్‌ స్పిన్‌ బౌలర్‌ కూడా అయిన వ్యాట్.. రెండు ఫార్మాట్లలో కలిపి 73 వికెట్లు పడగొట్టింది.