Anshul Kamboj: ఆహా అన్షుల్ కాంబోజ్.. ఒక్క బంతి ఆడకుండానే ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’.. భారత ప్లేయర్స్ లిస్ట్ ఇదే!

Anshul Kamboj Record

Anshul Kamboj Record

Anshul Kamboj Record: న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో భారత యువ బౌలర్ అన్షుల్ కాంబోజ్ అరుదైన ఘనతను ఖాతాలో వేసుకున్నాడు. వన్డే క్రికెట్‌లో ఒక్క బంతిని ఎదుర్కోకుండానే.. రెండు లేదా అంతకంటే తక్కువ వికెట్లు తీసి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్న భారత బౌలర్ల జాబితాలో చోటు దక్కించుకున్నాడు. బుధవారం ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో కాంబోజ్ ఈ రికార్డు అందుకున్నాడు. కాంబోజ్ తన 10 ఓవర్ల కోటాలో 22 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. ఇందులో రెండు మెయిడిన్ ఓవర్లు కూడా ఉన్నాయి. కాంబోజ్ బౌలింగ్ ప్రదర్శనకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు కూడా దక్కింది.

తొలి వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 40.2 ఓవర్లలో 185 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో కివీస్ భారీ స్కోరు చేయలేకపోయింది. అనంతరం వర్షం కారణంగా డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో భారత్ లక్ష్యాన్ని 32 ఓవర్లలో 143 పరుగులుగా నిర్ణయించారు. టీంఇండియా 22.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించి.. ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత్ విజయంలో అన్షుల్ కాంబోజ్ కీలక పాత్ర పోషించాడు. బ్యాటింగ్ చేసే అవకాశం రాకపోయినా.. బౌలింగ్‌లో అద్భుత ప్రతిభతో మ్యాచ్‌లో అత్యుత్తమ ఆటగాడిగా నిలిచాడు. దీంతో వన్డేల్లో ఒక్క బంతి కూడా ఆడకుండానే.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న భారత ఆటగాళ్ల ప్రత్యేక జాబితాలో కాంబోజ్ చేరాడు.

ఈ జాబితాలో అన్షుల్ కాంబోజ్ కంటే ముందు పలువురు భారత బౌలర్లు ఉన్నారు. 2023లో అహ్మదాబాద్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో జస్ప్రీత్ బుమ్రా 2 వికెట్లు తీసి 19 పరుగులు ఇచ్చి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. 2017లో దక్షిణాఫ్రికాతో ఓవల్‌లో జరిగిన మ్యాచ్‌లోనూ బుమ్రా 2 వికెట్లతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. 2013లో జింబాబ్వేతో బులవాయోలో జరిగిన వన్డేలో మోహిత్ శర్మ 2 వికెట్లు తీసి 28 పరుగులు ఇచ్చి ఈ ఘనత సాధించాడు. అదే ఏడాది ఎడ్జ్‌బాస్టన్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భువనేశ్వర్ కుమార్ 2 వికెట్లు తీసి 19 పరుగులు ఇచ్చి అవార్డును అందుకున్నాడు. అంతకుముందు 2000లో నైరోబీలో కెన్యాతో జరిగిన మ్యాచ్‌లో అనిల్ కుంబ్లే 2 వికెట్లు తీసి 22 పరుగులు ఇచ్చాడు. 1995లో ముంబైలో న్యూజిలాండ్‌తో జరిగిన వన్డేలో జవగళ్ శ్రీనాథ్ 2 వికెట్లు తీసి 22 పరుగులు ఇచ్చి ఈ ఘనత సాధించాడు. 1990లో లీడ్స్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అనిల్ కుంబ్లే 2 వికెట్లు తీసి 29 పరుగులు ఇచ్చి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.

భారత ప్లేయర్స్ లిస్ట్ ఇదే:
2/22 అన్షుల్ కంబోజ్ vs న్యూజిలాండ్, ఆక్లాండ్ 2026
2/19జస్ప్రీత్ బుమ్రా vs పాకిస్తాన్, అహ్మదాబాద్ 2023
2/28 జస్ప్రీత్ బుమ్రా vs దక్షిణాఫ్రికా, ది ఓవల్ 2017
2/26 మోహిత్ శర్మ vs జింబాబ్వే, బులవాయో 2013
2/19 భువనేశ్వర్ కుమార్ vs పాకిస్తాన్, ఎడ్జ్‌బాస్టన్ 2013
2/22 అనిల్ కుంబ్లే vs కెన్యా, నైరోబి 2000
2/22 జవగళ్ శ్రీనాథ్ vs న్యూజిలాండ్, ముంబై BS 1995
2/29 అనిల్ కుంబ్లే vs ఇంగ్లండ్, లీడ్స్ 1990