NTV Telugu Site icon

AUS vs IND: భారత్- ఆసీస్ మధ్య బాక్సింగ్ డే టెస్టు.. హాట్‌ కేకుల్లా అమ్ముడైన టికెట్లు

Aus Ind

Aus Ind

AUS vs IND: బోర్డర్-గావస్కర్‌ ట్రోఫీ సిరీస్‌ ఉత్కంఠ భరితంగా సాగనుంది. పెర్త్‌లో జరిగిన తొలి టెస్టులో భారత జట్టు గెలవగా.. అడిలైడ్ టెస్టులో ఆసీస్‌ విజయం సాధించింది. దీంతో ఐదు టెస్టుల సిరీస్‌ 1-1తో ఉంది. ఇక, డబ్ల్యూటీసీ ఫైనల్ కు చేరాలంటే రెండు టీమ్స్ కు ఈ సిరీస్‌ చాలా ముఖ్యం. కాబట్టి, మున్ముందు ఈ సిరీస్‌ మరింత హోరాహోరీగా కొనసాగడం ఖాయంగా కనబడుతుంది. తర్వాత జరిగే మ్యాచ్‌లపై ఫ్యాన్స్ ఆసక్తి పెరిగింది. డిసెంబర్ 26 నుంచి మెల్‌బోర్న్‌ వేదికగా నాలుగో టెస్టు స్టార్ట్ కానుంది. ఈ బాక్సింగ్‌ డే టెస్టు మ్యాచ్ కు సంబంధించిన టికెట్లకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఈ స్టేడియం కెపాసిటీ లక్ష మందికి పైగా ఉండగా.. మ్యాచ్‌కు ఇంకా 15 రోజుల సమయం ఉండగా.. ఇప్పుడే మొదటిరోజు ఆటకు సంబంధించిన టికెట్లన్నీ హాట్‌ కేకుల్లా అమ్ముడుపోయాయి. తొలి రోజుకు సంబంధించిన పబ్లిక్‌ టికెట్లన్నీ సేల్ అయినట్లు క్రికెట్ ఆస్ట్రేలియా ట్విటర్‌లో ప్రకటించింది.

Read Also: Vizag Honey Trap Case: జాయ్ జెమిమా హనీ ట్రాప్ కేసులో బిగ్‌ ట్విస్ట్..

అయితే, భారత్- ఆస్ట్రేలియా మధ్య జరిగిన రెండో టెస్ట్ అడిలైడ్‌లో జరిగింది. ఈ పింక్ బాల్‌ టెస్టుకు కూడా అభిమానులు భారీగా తరలి వచ్చారు. మూడు రోజుల్లో 1, 35, 012 మంది ప్రేక్షకులు వచ్చినట్లు పేర్కొనింది క్రికెట్ ఆస్ట్రేలియా. మొదటి రెండు రోజుల్లో రికార్డు స్థాయిలో (ఫస్ట్ రోజు 50,186 మంది, సెకండ్ డే 51,542 మంది) ఫ్యాన్స్ స్టేడియానికి వచ్చారు. కాగా, బోర్డర్-గావస్కర్ ట్రోఫీ సిరీస్‌లో భాగంగా మూడో టెస్టు బ్రిస్బేన్‌లోని గబ్బా గ్రౌండ్ లో జరగనుంది. డిసెంబర్ 14 నుంచి 18 వరకు ఈ మ్యాచ్‌ జరగనుంది.