NTV Telugu Site icon

Abhishek Sharma:అభిషేక్ శర్మ ఊచకోత.. టీ20ల్లో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ

Abhishak

Abhishak

భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదు టీ20ల సిరీస్ లో నేడు ఆఖరి మ్యాచ్ జరుగుతోంది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదకగా ఇరు జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో భాగంగా టాస్ గెలిచిన ఇంగ్లండ్ బౌలింగ్ ఎంచుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా ఇంగ్లీష్ జట్టుకు ముచ్చెమటలు పట్టిస్తోంది. ఈ మ్యాచ్ లో యంగ్ ప్లేయర్ అభిషేక్ శర్మ విధ్వంసం సృష్టించాడు. తన మెరుపు బ్యాటింగ్ తో ప్రత్యర్థి బ్యాటర్లపై విరుచుకుపడ్డాడు. టీ20ల్లో కొత్త చరిత్ర క్రియేట్ చేశాడు. ఇంగ్లాండ్ బౌలర్లను చిత్తు చేస్తూ కేవలం 37 బంతుల్లోనే అద్భుతమైన సెంచరీని సాధించాడు. అభిషేక్ 5 ఫోర్లు, 10 సిక్సర్లు బాది ఈ సెంచరీ పూర్తి చేశాడు. టీ20ల్లో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేశాడు.