ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్‌గా జస్ప్రీత్ బుమ్రాకు పేరుంది. అలాగే పాకిస్తాన్ పేస్ షహీన్ అఫ్రిదీ కూడా అద్భుత పెర్ఫామెన్స్‌తో అందరి మన్ననలు పొందుతున్నాడు. ప్రపంచ క్రికెట్‌లో ఇప్పటి వరకూ ఈ ఇద్దరూ తమదైన ముద్ర వేశారు. తమ టీమ్స్ విజయాల్లో కీలకపాత్ర పోషించారు. యార్కర్లతో ప్రత్యర్థి బ్యాటర్లను బోల్తా కొట్టించడంలో వీరికి వీరే సాటి. ప్రస్తుతం గాయాల కారణంగా ఈ ఇద్దరూ క్రికెట్‌కు దూరంగా ఉన్నారు. ప్రపంచంలో ఎంత గొప్ప బ్యాటర్‌ను అయినా తన పేస్‌తో బోల్తా కొట్టించగలిగే సత్తా బుమ్రాకు ఉంది. కానీ అలాంటి బౌలర్‌ను తీవ్రంగా అవమానించాడు పాక్ మాజీ ఆల్ రౌండర్ అబ్దుల్ రజాక్. అతడో బేబీ బౌలర్ అని అన్నాడు.
Abdul Razzaq: ఆ పాక్ బౌలర్ ముందు బుమ్రా పనికిరాడు: పాక్ మాజీ ప్లేయర్
“బుమ్రా కంటే షహీన్ అఫ్రిదీ చాలా చాలా మెరుగైన బౌలర్. షహీన్‌కు బుమ్రా దరిదాపుల్లో కూడా లేడు. నేను గ్లెన్ మెక్‌గ్రాత్, వసీం అక్రమ్ లాంటి గొప్ప బౌలర్లతో ఆడాను. అందువల్ల నా ముందు బుమ్రా ఓ బేబీ బౌలర్. అతన్ని నేను సులువుగా డామినేట్ చేసి, అటాక్ చేసేవాడిని” అని రజాక్ అన్నాడు. నిజానికి బుమ్రాపై రజాక్ ఇలాంటి కామెంట్స్ చేయడం ఇదే తొలిసారి కాదు. 2019లోనూ అతన్ని ఓ బేబీ బౌలర్ అంటూ రజాక్ అవమానించాడు. బుమ్రాపై రజాక్ పదేపదే ఇలాంటి కామెంట్స్ చేస్తుండటంపై భారత అభిమానులు తీవ్రంగా మండిపడుతున్నారు.
Dasara: నాని సినిమాకి ఈ రేంజ్ ఈవెంట్స్ ఎప్పుడూ చూడలేదు…
కాగా, బుమ్రా ఇంకా తన వెన్ను గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదు. గతేడాది ఆసియా కప్ తర్వాత బుమ్రా మళ్లీ ఇండియాకు ఆడలేదు. అతని సేవలను టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా ఎంతగానో మిస్ అయింది. అతడు ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడెమీలోనే సాధన చేస్తున్నాడు. ఆస్ట్రేలియాతో జరగబోయే నాలుగు టెస్టుల సిరీస్ కోసం తొలి రెండు టెస్టులకు ఎంపిక చేసిన టీమ్‌లో అతనికి చోటు దక్కలేదు.