టీ20 ప్రపంచకప్ 2024 గెలిచిన తర్వాత స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాకు వడోదరలో ఘనస్వాగతం లభించింది. అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. బార్బడోస్‌కు తిరిగి వచ్చిన తర్వాత హార్దిక్ పాండ్యా ఢిల్లీ చేరుకున్నాడు. ఇక్కడ ఆయన ప్రధాని మోడీని కలిశారు. దీని తర్వాత ముంబైలో టీమ్ ఇండియా గ్రాండ్ విక్టరీ పెరేడ్ జరిగింది. ఇందులో.. భారత జట్టు ఛాంపియన్‌ను చూసేందుకు వేలాది మంది ప్రజలు మెరైన్ డ్రైవ్ వీధుల్లో సందడి చేశారు. టీమిండియా బస్సు వాంఖడే స్టేడియంకు చేరుకోవడానికి గంటల తరబడి పట్టింది. విక్టరీ పరేడ్ తర్వాత హార్దిక్ పాండ్యా ముంబైలో ఉన్నాడు. ఈ సమయంలో.. అతను అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ వివాహానికి హాజరయ్యాడు. పెళ్లి వేడుకలో హార్దిక్ పాండ్యా చాలా సరదాగా కనిపించాడు.
READ MORE: Uday Pratap Singh: మొహర్రం వరకు ఎమ్మెల్యే ‘రాజా భయ్యా’ తండ్రి హౌస్ అరెస్ట్..
ఈ రోజు పాండ్యా వడోదర చేరుకున్నాడు. హార్దిక్ పాండ్యా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో వరల్డ్ కప్ తర్వాత మొదటి సారిగా సొంత గడ్డకు చేరుకున్న హార్దిక్ ను చూసేందుకు జనాలు భారీగా తరలి వచ్చారు. వేలాది మంది అభిమానుల సమక్షంలో పాండ్యా బస్సులో నిలబడి ఉన్నాడు. ప్రైడ్ ఆఫ్ వడోదర అని బస్సుపై రాసి ఉంది.భారత జట్టు టీ20 ప్రపంచకప్ గెలవడంలో అనుభవజ్ఞుడైన ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా కీలక పాత్ర పోషించాడు. తన బౌలింగ్‌తో అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఈ సీజన్ లో150 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేసిన పాండ్యా 144 పరుగులు చేశాడు. 11 వికెట్లు పడగొట్టాడు. 30 ఏళ్ల హార్దిక్ పాండ్యా తన కెరీర్‌లో మొత్తం 11 టెస్టులు, 86 వన్డేలు, 100 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఈ వరల్డ్ కప్ తన కెరీర్ లో మైలురాయిగా మిగలనుంది.