NTV Telugu Site icon

అశ్విన్ ఇంట్లో కరోనా కల్లోలం..10 మందికి కరోనా !

టీం ఇండియా క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ ఇంట్లో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. అశ్విన్ ఇంట్లో ఏకంగా 10 మందికి కరోనా సోకింది. ఈ విషయాన్ని స్వయంగా అశ్విన్ భార్య ప్రీతి ట్విటర్ లో పేర్కొంది. “ఒకే వారంలో ఇంట్లోని ఆరుగురు పెద్దవాళ్ళు, నలుగురు పిల్లలకు పాజిటివ్ గా తేలింది పిల్లల వల్ల అందరికీ కరోనా సోకింది. అందుకే గతవారం ఓ పేడకలలా గడిచింది. అందరూ జాగ్రత్తగా ఉండండి. టీకా తీసుకోండి.” అని అశ్విన్ భార్య ప్రీతి ట్వీట్ చేసింది.