Site icon NTV Telugu

Personality Observation: నువ్వెంటో చెప్పే నిద్ర

Sleeping

Sleeping

మనిషి మెంటాలిటీని రకరకాలుగా అంచనా వేయొచ్చు. మెలకువతో ఉంటే మొహం చూసి చెప్పొచ్చు. నిద్రించేటప్పుడు పడుకున్న తీరును బట్టి పర్సనాలిటీని పట్టేసుకోవచ్చు. ముఖ్యంగా నాలుగు స్లీపింగ్‌ పొజిషన్‌ల ఆధారంగా మనుషుల వ్యక్తిత్వాల్ని విశ్లేషించొచ్చు. వరుసగా వారం రోజుల పాటు మీరు నిద్రపోయే విధానాన్ని పరిశీలిస్తే వచ్చే ఐదేళ్ల వరకు మీరేంటో ఇట్టే ఒక అంచనాకు రావొచ్చని ఓ జర్నల్‌ పేర్కొంది. స్లీప్‌ సైకాలజిస్టులు, నిపుణులు చెప్పిన వివరాల ప్రకారం..

వెల్లకిలా పడుకునేవాళ్లు నలుగురిలో సెంటరాఫ్‌ అట్రాక్షన్‌గా ఉండాలని కోరుకుంటారు. పాజిటివ్‌గా ఆలోచిస్తారు. తనలా ఉండేవాళ్లనే ఇష్టపడతారు. చిల్లరగా మాట్లాడరు. ఒక స్థాయిలో, తన లెవల్‌లో జరిగే చర్చల్లో మాత్రమే పాల్గొంటారు. తనతోపాటు ఇతరుల నుంచి కూడా ఎక్కువ ఎక్స్‌పెక్ట్‌ చేస్తారు. వీళ్లలోని నిజాయితీని నలుగురూ మెచ్చుకుంటారు. తియ్యటి మాటలు చెప్పాలని ఆశించరు. లక్ష్యం కోసం లక్షణంగా పనిచేసుకుపోతారు. మీకు మీరే కింగ్ అనుకుంటారు. ఓపెన్‌గా ఉంటారు.

read also: Piyush Goyal: నేను బిజీగా వుంటా .. రాష్ట్ర మంత్రుల‌పై కేంద్రమంత్రి ఫైర్‌

పక్కకు తిరిగి పడుకునేవాళ్లు సైలెంట్‌ పర్సన్స్‌ అని చెప్పొచ్చు. నమ్మదగ్గవాళ్లు కూడా. టేకిటీజీ పాలసీ ఫాలో అవుతారు. యాక్టివ్‌గా ఉంటారు. గతం గతః అంటారు. జరిగిపోయిన దాని గురించి దిగులు చెందరు. జరగబోయే దాని గురించీ పట్టించుకోరు. పరిస్థితులకు తగ్గట్లు అడ్జస్ట్‌ అవుతారు. మీ గురించి మీకు బాగా తెలుసు. కాబట్టి కష్టాల్లో కూడా మొహంలో నవ్వు చెరగనీయరు. ఎప్పుడూ హ్యాపీగానే కనిపిస్తుంటారు. ముడుచుకొని పడుకునేవాళ్లు కాస్త భయస్తులని చెప్పొచ్చు. వీళ్లది అచ్చం చిన్న పిల్లల మాదిరి మనస్తత్వం. ఇతరుల పైన ఎక్కువగా ఆధారపడతారు. పెద్ద సమస్యల నుంచి దూరం జరుగుతారు. మనసులో ఏదైనా ఉంటే అంత తొందరగా బయటపడరు. ఎదుటివాళ్లను తేలిగ్గా నమ్మరు. లోపల బలమైన ఎమోషన్‌ ఉన్నా బయటికి మాత్రం స్ట్రాంగ్‌ పర్సన్‌లా బిల్డప్‌ ఇస్తారు.

బోర్లా పడుకునేవాళ్లు దృఢ సంకల్పులని, సాహసులని చెప్పొచ్చు. సమస్యలను పరిష్కరించటంలో వీళ్లు నేర్పరులు కూడా. రిస్క్‌ తీసుకునేందుకు ఏమాత్రం వెనకాడరు. తద్వారా ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తారు. లీడర్‌లా గైడెన్స్‌ ఇస్తూ నలుగురినీ ముందుండి నడిపిస్తారు. రోజూ పూర్తిగా ఎనిమిది గంటలు పడుకోవాలనుకుంటారు. ఎప్పుడూ ఎనర్జెటిక్‌గా, రీచార్జ్‌డ్‌గా కనిపిస్తారు. అయితే.. విమర్శలను స్వీకరించలేరు. ఆత్మవిమర్శ అసలే చేసుకోరు.

Exit mobile version