NTV Telugu Site icon

Tollywood Lovers :వాలెంటైన్స్‌ డే స్పెషల్.. ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటలు ఎవరో తెలుసా?

List Of South Stars Who Married Their Co Stars

List Of South Stars Who Married Their Co Stars

సినీ ఇండస్ట్రీలో ప్రేమించి పెళ్లి చేసుకోవడం కామన్.. ఇప్పటికే ఎన్నో జంటలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. ఫిబ్రవరి 14 అనగానే ప్రేమ పక్షులకు చాలా ప్రత్యేకమైన రోజు. ఈ రోజును ఎందరో ప్రేమికులు ప్రత్యేకంగా జరుపుకోవాలని ప్లాన్‌తో ఉంటారు.. అక్షరాలు రెండే అయిన రెండు జీవితాలను ఏకం చేసే పవిత్ర బంధం.. తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా ఎన్నో జంటలు తమ ప్రేమను పెళ్లి వరకు తీసుకెళ్లారు.. ఆ జంటలు ఎవరో ఒక్కసారి చూసేద్దాం..

నాగార్జున అమల..

వీరిద్దరి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఓ సినిమా సెట్ లో పరిచయమైన వీళ్ల మధ్య ప్రేమ చిగురించింది.. 1992లో వివాహం చేసుకున్నారు. ప్రేమ యుద్దం, చినబాబు, శివ, నిర్ణయం లాంటి చిత్రాల్లో జంటగా నటించారు. అయితే నాగార్జునని పెళ్లాడిన తర్వాత అమల సినిమాలకు గుడ్‌ బై చెప్పింది…

శ్రీకాంత్-ఊహా..

1994లో ‘ఆమె’ సినిమా షూటింగ్‌ సమయంలో శ్రీకాంత్‌, ఊహల మధ్య పరిచయం ఏర్పడింది. ఆమె, ఆయనగారు లాంటి చిత్రాల్లో కలిసి నటించారు ఆ తర్వాత వీరిద్దరూ కలిసి నాలుగు సినిమాల్లో జంటగా నటించారు.. ఆ తర్వాత మూడేళ్లకు పెళ్లితో ఒక్కటయ్యారు..

రాజశేఖర్-జీవిత..

టాలీవుడ్ హీరోల్లో రాజశేఖర్ అంటేనే ఓ స్పెషల్. రాజశేఖర్, జీవిత జంటగా సూపర్ హిట్‌ సినిమాల్లో నటించారు. మొదట జీవితనే రాజశేఖర్‌కు ప్రపోజ్ చేశారు. ఆ త‍ర్వాత మూడేళ్లపాటు ప్రేమించుకున్నారు. ఆ తర్వాత కుటుంబసభ్యుల అంగీకారంతో వివాహం చేసుకున్నారు..

మహేష్ బాబు – నమ్రత..

వంశీ చిత్రంలో మహేశ్‌ – నమ్రత కలిసి నటించారు. అప్పుడే ప్రేమలో పడ్డారు. దాదాపు ఐదేళ్లపాటు సీక్రెట్‌గా తమ బంధాన్ని కొనసాగించారు. ఆ తర్వాత 2005 లో పెళ్లి తో ఒక్కటయ్యారు..

వీళ్ళే కాదు.. అల్లు అర్జున్-స్నేహ, రామ్ చరణ్-ఉపాసన,నాని-అంజనా యలవర్తి,నాగ చైతన్య-సమంత,వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి, ఇలా ఎంతో మంది ప్రేమ పెళ్లిళ్లు చేసుకున్నారు..