Titanic Life Jacket: 114 ఏళ్ల కిందటి విషాదానికి సాక్ష్యం.. వేలంలో రూ.8 కోట్లు పలికిన టైటానిక్ లైఫ్ జాకెట్!
Titanic Life Jacket: ఎప్పటికీ మునిగిపోదని అందరూ భావించిన ‘టైటానిక్’ నౌక.. 114 ఏళ్ల క్రితం అట్లాంటిక్ మహాసముద్రంలో మంచుకొండను ఢీకొని సముద్ర గర్భంలో కలిసిపోయిన సంగతి తెలిసిందే. ఆ ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన ఒక అదృష్టవంతురాలు ధరించిన ‘లైఫ్ జాకెట్’ తాజాగా జరిగిన వేలంలో భారీ ధరకు అమ్ముడుపోయింది. బ్రిటన్‌కు చెందిన హెన్రీ ఆల్డ్రిడ్జ్ అండ్ సన్ అనే వేలం సంస్థ నిర్వహించిన ఈ ఆక్షన్‌లో, ఈ లైఫ్ జాకెట్ 6,70,000 పౌండ్లు (సుమారు రూ.8 కోట్ల పైమాటే) పలికి అందరినీ ఆశ్చర్యపరిచింది.
అంచనాలను మించిన ధర..
ముందుగా ఈ జాకెట్ ధర 2,50,000 పౌండ్ల నుంచి 3,50,000 పౌండ్ల మధ్య ఉంటుందని భావించారు. కానీ వేలంలో దీనికి అనూహ్య స్పందన లభించింది. టైటానిక్ ప్రమాదం నుంచి బయటపడి, ఇప్పటికీ సురక్షితంగా ఉన్న ఏకైక లైఫ్ జాకెట్ ఇదే కావడం విశేషం. అందుకే దీనిని ‘వన్స్ ఇన్ ఏ జనరేషన్ సేల్’ (తరంలో ఒక్కసారి మాత్రమే వచ్చే అవకాశం) గా వేలం సంస్థ పేర్కొంది. ఈ లైఫ్ జాకెట్‌ను లారా మేబెల్ ఫ్రాంకాటెల్లి అనే మహిళా ప్రయాణికురాలు ధరించారు. ఆమె ఆ రోజుల్లో టైటానిక్ నౌకలో ఫస్ట్ క్లాస్‌లో ప్రయాణిస్తున్నారు. ఆమె ప్రఖ్యాత ఫ్యాషన్ డిజైనర్ లూసీ డఫ్ గోర్డాన్ వద్ద సెక్రటరీగా పనిచేసేవారు. ప్రమాద సమయంలో లారా తన బాస్ దంపతులతో కలిసి ‘లైఫ్ బోట్ నంబర్ 1’ ద్వారా ప్రాణాలతో బయటపడ్డారు.
Also Read
- Hindu Funeral Traditions: హిందూమతంలో పసిబిడ్డలను ఎందుకు దహనం చేయరో తెలుసా? అసలు కారణం ఇదేనా!
- Kedarnath: కేదార్‌నాథ్‌కు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా? స్కంద పురాణంలో ఉన్న అసలు రహస్యం ఇదే!
- Chanakya Niti: విలువల ముసుగులో మోసపోకండి! ఎవరిని నమ్మాలో.. ఎవరిని నమ్మకూడదో నేర్పిస్తున్న చాణక్య నీతి
- Chanakya Niti: మీ శత్రువుపై విజయం సాధించడం ఇక చిటికెలో పని! ప్రపంచాన్ని శాసించిన చాణక్యుడి మాస్టర్ ప్లాన్ ఇదే..
జాకెట్ ప్రత్యేకతలివే..
బేజ్ రంగులో ఉన్న ఈ లైఫ్ జాకెట్‌పై లారాతో పాటు ఆ రోజు ఆమెతో కలిసి ప్రాణాలతో బయటపడిన ఇతరుల సంతకాలు కూడా ఉన్నాయి. దీనిని కాన్వాస్ క్లాత్‌తో చేసిన 12 పాకెట్లలో కార్క్ (చెక్క ముక్కల వంటివి) నింపి తయారు చేశారు. గతంలో దీనిని టైటానిక్ మ్యూజియంలలో ప్రదర్శనకు ఉంచారు. తాజాగా ఒక ప్రైవేట్ కలెక్టర్ దీనిని కొనుగోలు చేశారు. వేలం సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఆండ్రూ ఆల్డ్రిడ్జ్ మాట్లాడుతూ.. “టైటానిక్ మీద 2,200 మంది ప్రయాణికులు ఉంటే, అందులో ప్రతి ఒక్కరిదీ ఒక కథ. ఈ వస్తువుల ద్వారా మేము ఆ కథలను మళ్లీ ప్రపంచానికి గుర్తు చేస్తున్నాము. టైటానిక్ చరిత్రలో ఈ లైఫ్ జాకెట్ అత్యంత ప్రతిష్టాత్మకమైన వస్తువు” అని తెలిపారు. 1912 ఏప్రిల్ 10న ప్రయాణం మొదలుపెట్టిన టైటానిక్, కేవలం నాలుగు రోజులకే (ఏప్రిల్ 14 రాత్రి) మంచుకొండను ఢీకొంది. ఆ ప్రమాదంలో సుమారు 2,220 మందిలో కేవలం 700 మంది మాత్రమే ప్రాణాలతో బయటపడగా, మిగిలిన వారు సముద్రంలో ప్రాణాలు విడిచారు.
తాజావార్తలు
-
Titanic Life Jacket: 114 ఏళ్ల కిందటి విషాదానికి సాక్ష్యం.. వేలంలో రూ.8 కోట్లు పలికిన టైటానిక్ లైఫ్ జాకెట్!
-
Telangana : పోలీస్ శాఖలో భారీ పదోన్నతులు.. సజ్జనార్, మహేష్ భగవత్ లకు డీజీపీ హోదా..!
-
Earthquake: గుజరాత్‌లో భూకంపం.. ఆందోళనలో ప్రజలు!
-
Donald Trump: గుడ్‌న్యూస్ చెప్పిన డొనాల్డ్ ట్రంప్.. ఈ శుక్రవారంతో అంతా ఫైనల్..
-
PM Modi: ప్రధాని మోడీపై సంచలన వ్యాఖ్యలు.. మల్లికార్జున్ ఖర్గేకు ఎన్నికల సంఘం నోటీసులు
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?