Teachers Day 2026: ఈ రోజే టీచర్స్ డే.. గురువు గొప్పతనం ఏంటో తెలుసుకోవాలంటే ఈ ఒక్క కథ చాలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Teachers Day 2026: భారతదేశంలో ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటారు. భారత మాజీ రాష్ట్రపతి, తత్వవేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని ఈ రోజును టీచర్స్ డేగా నిర్వహిస్తున్నారు. మన జీవితంలో తల్లిదండ్రుల తర్వాత సరైన మార్గాన్ని చూపించే వారు గురువులే. వారి జ్ఞానం, అంకితభావం, ప్రేమ, ప్రోత్సాహం విద్యార్థులను మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తాయి. గురువు అంటే కేవలం పాఠాలు చెప్పే వ్యక్తి మాత్రమే కాదు.. మనలోని అజ్ఞానాన్ని తొలగించి, సరైన దారిని చూపించి, మనలో దాగి ఉన్న సామర్థ్యాన్ని గుర్తించేలా చేసేవారు. అందుకే భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయంలో గురువుకు ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది. గురువు గొప్పతనాన్ని, గురు తత్వం యొక్క అసలు అర్థాన్ని వివరించే ఓ ఆసక్తికరమైన కథ కూడా ఉంది. అదే గురు పూర్ణిమ తొలి కథగా చెబుతారు. ఇంతకీ ఆ కథ ఏంటో మీకు తెలుసా.. ఈ స్పెషల్ స్టోరీలో ఆ కథను తెలుసుకుందాం.
నలుగురు వృద్ధులు.. నాలుగు ప్రశ్నలు
చాలా కాలం క్రితం నలుగురు వృద్ధులు తమ జీవితాలకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానాల కోసం అన్వేషిస్తూ ప్రయాణం సాగించారు. వారిలో మొదటి వ్యక్తి తీవ్ర దుస్థితిలో ఉన్నాడు. తన సమస్యల నుంచి ఎలా బయటపడాలో తెలుసుకోవాలనుకున్నాడు. ఇక రెండో వ్యక్తి జీవితంలో మరింత పురోగతి, విజయం సాధించాలని కోరుకున్నాడు. దానికి సరైన మార్గం ఏమిటో తెలుసుకోవాలని అనుకున్నాడు. మూడో వ్యక్తి మాత్రం అసలు జీవితానికి అర్థం ఏమిటో తెలుసుకోవాలని అన్వేషిస్తున్నాడు. ఇకపోతే నాలుగో వ్యక్తికి అప్పటికే ఎంతో జ్ఞానం ఉంది. అయినప్పటికీ తనలో ఏదో లోటు ఉందనే భావన మాత్రం అతడిని ఎప్పుడూ వెంటాడుతోంది. అసలు తనకు ఏం కావాలో అతడికే అర్థం కాలేదు. వారి సమస్యలకు సమాధానాల కోసం వెతుకుతున్న ఆ నలుగురూ చివరకు ఓ మర్రిచెట్టు ఉన్న ప్రదేశానికి చేరుకున్నారు. అక్కడ ఓ యువకుడు పెద్ద చిరునవ్వుతో ప్రశాంతంగా కూర్చుని ఉన్నాడు. అతడిని చూసిన వెంటనే తమ ప్రశ్నలకు ఈ యువకుడే సమాధానం చెప్పగలడనే భావన ఆ నలుగురిలోనూ కలిగింది. వారంతా అతడి దగ్గర కూర్చున్నారు. అయితే ఆ యువకుడు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అయినప్పటికే ఆ నలుగురికీ తాము వెతుకుతున్న సమాధానాలు లభించాయని అర్థం అయ్యింది. ఈ సంఘటనతోనే గురు పరంపర ప్రారంభమైందని ఆధ్యాత్మిక సంప్రదాయంలో చెబుతారు. ఆ నలుగురు వృద్ధులూ అనంతరం గురువులుగా మారారని చరిత్ర చెబుతోంది.
Also Read
- Father-Daughter Bond: తండ్రి ప్రేమకు నెటిజన్లు ఫిదా.. Miss You మెసేజ్.. కూతురి కోసం 14 గంటల ప్రయాణం..
- Janmashtami 2026 Fasting Rules: కృష్ణ జన్మాష్టమి 2026.. ఉపవాసం నుంచి నిశీథి పూజ వరకు పూర్తి వివరాలు
- Raksha Bandhan 2026: రాఖీ ఎప్పుడు కట్టాలి? ఎలా కట్టాలి? శుభ సమయాలతో పాటు రక్షా బంధన్ పూర్తి వివరాలు ఇవే..
- Success Story: ఆ ఒక్క నిర్ణయం అతని జీవితాన్నే మార్చేసింది.. IT జాబ్ వదిలి మష్రూమ్ బిజినెస్‌తో లక్షలు!
ఎవరి సమస్యకు ఎలాంటి పరిష్కారం?
ఈ కథ ప్రకారం మొదటి వ్యక్తి తన దుస్థితి నుంచి బయటపడగా.. రెండో వ్యక్తి సమృద్ధి, సంతోషాన్ని పొందాడు. మూడో వ్యక్తి తన జీవితానికి సంబంధించిన అన్వేషణకు ముగింపు పొందాడు. నాలుగో వ్యక్తికి మాత్రం అప్పటికే జ్ఞానం ఉన్నప్పటికీ.. దాన్ని సరిగ్గా వ్యక్తీకరించడానికి, తన అంతరంగాన్ని అనుసంధానించడానికి ఓ గురువు అవసరమైంది. ఆ యువ గురువుతో అతడికి ఆ అంతరంగ అనుబంధం ఏర్పడింది. అంటే గురువు మనకు సమాధానాలు చెప్పడమే కాదు.. మనలోనే ఉన్న సమాధానాలను మనం గుర్తించేలా చేస్తాడనే భావన ఈ కథలో కనిపిస్తుంది. ఈ కథలోని అత్యంత ఆసక్తికరమైన అంశం ఏంటంటే.. గురువు ఒక్క మాట కూడా మాట్లాడకుండా శిష్యులకు జ్ఞానాన్ని అందించడం. భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయంలో దక్షిణామూర్తిని ఆదిగురువుగా భావిస్తారు. ఆయన మౌనం ద్వారానే పరబ్రహ్మ తత్వాన్ని బోధిస్తారనే భావన ఉంది. ఆదిశంకరాచార్యులకు ఆపాదించబడే ‘మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మ తత్వం యువానం’ అనే ప్రసిద్ధ స్తోత్ర భావన కూడా గురువు మౌన బోధన యొక్క గొప్పతనాన్ని వివరిస్తుంది. ఈ కథలో మర్రిచెట్టును కూడా ఓ ప్రతీకగా భావిస్తారు. మర్రిచెట్టు పెద్దగా ఎవరి సంరక్షణ అవసరం లేకుండానే పెరుగుతుంది. అనుకూల పరిస్థితులు లేకపోయినా.. కొద్దిపాటి మట్టి, నీటితో కూడా తన వృద్ధిని కొనసాగించగలదు. అంతేకాదు.. తనకు ఏమీ ఆశించకుండా ఇతరులకు నీడను, జీవానికి అవసరమైన ఆక్సిజన్‌ను అందించే దాని స్వభావం గురు తత్వానికి ప్రతీకగా చెబుతారు. గురువు కూడా అంతే. తన జ్ఞానాన్ని ఇతరులకు పంచుతూ.. వారి జీవితాల్లోని అజ్ఞానం, భయం, ఒంటరితనం, లేమి వంటి భావనలను తొలగించి స్వాతంత్య్రం వైపు నడిపిస్తాడు.
గురువు అంటే ఎవరు?
‘గురు’ అనే పదానికి ఆధ్యాత్మికంగా ఎంతో లోతైన అర్థం ఉంది. అజ్ఞానం అనే చీకటిని తొలగించి జ్ఞానం అనే వెలుగును చూపించేవాడే గురువు. జీవితంలో మనం ఎటు వెళ్లాలో తెలియని సమయంలో సరైన మార్గాన్ని చూపించేవారు కూడా గురువులే. ఈ కథలో గురువు యువకుడిగా, శిష్యులు వృద్ధులుగా కనిపించడం కూడా ఓ ప్రతీక. ప్రపంచంలో ఏదో ఒకదాని కోసం నిరంతరం అన్వేషించడం మనసును అలసిపోయేలా చేస్తుంది. అందుకే శిష్యులను వృద్ధులుగా, ఆత్మను ఎప్పటికీ యవ్వనంగా ఉండే గురువుగా ఈ కథలో చూపించినట్లు చెబుతారు. సెప్టెంబర్ 5న టీచర్స్ డే సందర్భంగా మనకు విద్యను అందించిన ఉపాధ్యాయులను గుర్తు చేసుకోవడంతో పాటు.. మన జీవితాల్లో మార్గదర్శకులుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేయడం ఎంతో ప్రత్యేకం. మనకు జ్ఞానాన్ని అందించి.. సరైన మార్గంలో నడిపించి.. మంచి మనిషిగా ఎదగడానికి స్ఫూర్తినిచ్చిన ప్రతి గురువుకూ హృదయపూర్వక ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు.
తాజావార్తలు
-
Teachers Day 2026: ఈ రోజే టీచర్స్ డే.. గురువు గొప్పతనం ఏంటో తెలుసుకోవాలంటే ఈ ఒక్క కథ చాలు!
-
POCO X8, X8 Power: పోకో ఎక్స్8 పవర్, పోకో ఎక్స్8 భారత్‌లో లాంచ్.. 10,000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్, ధరలు ఇవే!
-
Dharman: రజనీకాంత్ ‘ధర్మన్’ రెండో షెడ్యూల్ పూర్తి.. రెండు రోజుల్లోనే షూటింగ్ ఫినిష్?
-
CM Chandrababu: ఉద్యోగుల సమస్యలపై ఫోకస్.. నేడు 11 సంఘాలతో సీఎం భేటీ.. పీఆర్సీ, ఐఆర్, డీఏపై కీలక చర్చ..
-
India vs Pakistan: నేడు భారత్ vs పాకిస్తాన్ మహిళల టీ20 మ్యాచ్.. ఎప్పుడు, ఎక్కడ, ఎలా లైవ్ చూడాలి?
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!