Subscribers Want Free Content On OTTs: మన దేశంలో ప్రేక్షకులు ఎంటర్టైన్‌మెంట్ కోసం వెండి తెర కన్నా బుల్లి తెర కన్నా ఓటీటీకే ఎక్కువ ఓటేస్తున్నారు. దీంతో గతేడాది కన్నా ఈ సంవత్సరం ఓటీటీ ఆడియెన్స్ సంఖ్య 20 శాతం పెరిగింది. ఇండియాలో ప్రస్తుతం ఓటీటీ వీక్షకుల సంఖ్య 42 పాయింట్ మూడు 8 కోట్లుగా నమోదైంది. ఈ విషయాన్ని ‘‘ది ఆర్మాక్స్ ఓటీటీ ఆడియెన్స్ రిపోర్ట్’’ వెల్లడించింది. ఈ ఏడాదికి సంబంధించి జులై-సెప్టెంబర్ నివేదిక లేటెస్ట్‌గా రిలీజ్ అయింది. రిపోర్ట్ రూపొందించేందుకు ఈ సంస్థ దేశవ్యాప్తంగా 13 వేల 500 మంది నుంచి సమాచారం సేకరించారు.
గడచిన నెల రోజుల్లో ఒక్క సారైనా ఒక డిజిటల్ వీడియో చూసినవారిని ఓటీటీ ఆడియెన్స్‌గా పరిగణనలోకి తీసుకుంటారు. పోయినేడాదితో పోల్చితే ఈ సంవత్సరం 7 కోట్ల మందికి పైగా కొత్త వీక్షకులు ఈ కేటగిరీలో చేరారు. కిందటేడాది ఓటీటీ విస్తృతి 25 పాయింట్ 3 శాతం ఉండగా ఈసారి 30 శాతానికి వృద్ధి చెందింది. చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలు, మెట్రో నగరాలు, మినీ మెట్రో సిటీలు.. ఇలా అన్ని చోట్లా ఓటీటీలో వీడియోలు వీక్షించేవారి సంఖ్య రోజురోజుకూ అధికమవుతోంది. ఈ మార్కెట్లలో ఇప్పటికే 70 శాతానికి పైగా ప్రజలు డిజిటల్ వీడియోలనే చూస్తున్నారు.
read also: Vodafone Idea is Losing Customers: ప్రతి నెలా భారీగా తగ్గిపోతున్న ‘వీఐ’ కస్టమర్ల సంఖ్య
భారతదేశంలో ఇప్పుడు 42 కోట్ల మందికి పైగా ఉన్న మొత్తం ఓటీటీ ఆడియెన్స్‌ను ఈ ఆర్మాక్స్ రిపోర్టు నాలుగు సెగ్మెంట్లుగా విభజించింది. ఎస్‌వీఓడీ డైరెక్ట్ అనే ఫస్ట్ కేటగిరీలోని ప్రేక్షకులు ఏదైనా ఒక స్ట్రీమింగ్ సర్వీస్‌కి నేరుగా డబ్బు చెల్లించి వీడియోలు చూస్తున్నారు. ఎస్‌వీఓడీ ఇన్‌డైరెక్ట్ అనే సెకండ్ సెగ్మెంట్‌లోని వీక్షకులు డబ్బులు కట్టకుండానే కంటెంట్ వీక్షిస్తున్నారు. ఈ మేరకు వాళ్లు కుటుంబ సభ్యుల మెంబర్‌షిప్ ద్వారా లేదా టెలికం బండిల్స్ ద్వారా ఈ సర్వీసును ఎంజాయ్ చేస్తున్నారు.
‘ఏవీఓడీ ప్లస్’ అనే థర్డ్ సెక్షన్‌లో జనాలు ఉచిత స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్‌లో వీడియోలు తిలకిస్తున్నారు. ఇందులో యూట్యూబ్‌తోపాటు కనీసం ఒక్క ఓటీటీ వేదికైనా ఉంటుంది. ‘‘యూట్యూబ్ ప్లస్ సోషల్ మీడియో ఓన్లీ’’ అనే నాలుగో సెగ్మెంట్‌లో కస్టమర్లు వీడియోలను కేవలం యూట్యూబ్‌లో లేదా యూట్యూబ్‌తోపాటు సామాజిక మాధ్యమాల్లో చూస్తున్నారు. మొత్తం ఓటీటీ యూజర్లలో పెయిడ్ కేటగిరీ పర్సంటేజీ.. అంటే.. ఎస్‌వీఓడీ డైరెక్ట్ అండ్ ఇన్‌డైరెక్ట్ పర్సంటేజీ కలిపి 30కి పైగానే ఉంది. ఫ్రీగా కంటెంట్ చూసేవారి సంఖ్య మాత్రం అత్యధికంగా 69 శాతానికి పైగా ఉండటం విశేషం.
2021తో పోల్చితే 2022లో ఓటీటీ యూనివర్స్‌లో యూట్యూబ్ ప్లస్ సోషల్ మీడియా ఓన్లీ అనే ఫోర్త్ సెగ్మెంట్‌లో వీడియోలు వీక్షించేవారి సంఖ్య హయ్యస్ట్ రెండున్నర కోట్లు పెరిగింది. టోటల్‌గా గ్రోత్ పర్సంటేజీ కూడా ఈ సెక్షన్‌లోనే ఎక్కువగా నమోదు కావటం గమనించాల్సిన విషయం. ఇదిలాఉండగా ఆర్మాక్స్ సంస్థ ఈ ఓటీటీ ఆడియెన్స్ రిపోర్ట్‌ను 2021వ సంవత్సరం నుంచి పబ్లిష్ చేస్తోంది. డిజిటల్ వీడియో మార్కెట్ పెరుగుదలను ప్రైమరీ డేటా రీసెర్చ్ ఆధారంగా లెక్కిస్తోంది. ఇంటర్నెట్, స్మార్ట్‌ఫోన్, ఇండస్ట్రీ ఎస్టిమేట్స్ తదితర సెకండరీ డేటా మీద ఆధారపడకుండా నివేదికను జెన్యూన్‌గా రూపొందిస్తోంది.