NTV Telugu Site icon

Startups Funding Down: స్టార్టప్‌లు కాదు.. స్టార్ట్‌డౌన్‌లు. గతేడాది తగ్గిన ఫండింగ్‌

Startups Funding Down

Startups Funding Down

Startups Funding Down: 2022లో మన దేశంలో స్టార్టప్‌లకు ఆశించిన స్థాయిలో డబ్బు పుట్టలేదు. 2021వ సంవత్సరంతో పోల్చితే 33 శాతం ఫండింగ్‌ పడిపోయింది. దీంతో.. గతేడాది సమీకరించిన మొత్తం నిధుల విలువ 24 బిలియన్‌ డాలర్లకే పరిమితమైంది. 2021లో అయితే 35 బిలియన్‌ డాలర్లకు పైగా ఫండ్స్‌ జమకావటం విశేషం. ప్రపంచ ఆర్థిక మందగమన పరిస్థితుల్లో కూడా గ్లోబల్‌ ఇన్వెస్టర్లు ఇండియన్‌ స్టార్టప్‌ ఎకోసిస్టమ్‌ పట్ల పాజిటివ్‌గానే ఉన్నప్పటికీ క్రితం సంవత్సరం ఇలాంటి క్లిష్ట పరిస్థితి నెలకొనటం ఆశ్చర్యం కలిగిస్తోంది.

read more: Gold Imports: డిసెంబర్‌లో 79 శాతం తగ్గిన బంగారం దిగుమతి

అయితే.. పోయినేడాది స్టార్టప్‌లకు లభించిన నిధులు అంతకుముందు రెండేళ్లలో జరిగిన ఫండ్‌ రైజ్‌ కన్నా దాదాపు రెట్టింపు కావటం గమనించాల్సిన అంశం. ఈ వివరాలను ‘‘స్టార్టప్‌ ట్రాకర్‌-CY22’’ పేరుతో PwC India రూపొందించిన నివేదిక వెల్లడించింది. ఇండియన్‌ స్టార్టప్స్‌కి 2019లో 13 బిలియన్‌ డాలర్లకు పైగా ఫండ్స్‌ రాగా 2020లో దగ్గరదగ్గరగా 11 బిలియన్‌ డాలర్ల నిధులు వచ్చాయి.

ఇదిలాఉండగా.. 2022 మొత్తమ్మీద స్టార్టప్‌లకు టోటల్‌ ఫండింగ్‌ తగ్గినప్పటికీ కొన్ని విషయాల్లో సానుకూల వాతావరణం నెలకొందని PwC India ప్రతినిధి చెప్పారు. సాఫ్ట్‌వేర్‌ యాజ్‌ ఏ సర్వీస్‌ అంటే సాస్‌ మరియు ఎర్లీ స్టేజ్‌ ఫండింగ్‌ వంటి అంశాల్లో నిధుల సమీకరణకు కొదవ లేకుండా పోయిందని అన్నారు. మిగతా సెగ్మెంట్లలోనూ రానున్న 2, 3 త్రైమాసికాల్లో సాధారణ పరిస్థితులు నెలకొంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

పోయినేడాది ఫండింగ్‌ తగ్గిపోవటంతో చాలా స్టార్టప్‌లు తమ ఆపరేటింగ్‌ మోడల్స్‌ని కుదించుకుంటున్నాయని చెప్పారు. అదే సమయంలో ఖర్చులను తగ్గించుకుంటున్నాయని, కొత్త పెట్టుబడులను వాయిదా వేస్తున్నాయని పేర్కొన్నారు. స్టార్టప్‌ ట్రాకర్‌-CY22 రిపోర్ట్ ప్రకారం 2021, 22ల్లో జరిగిన ఫండ్‌రైజింగుల్లో సంఖ్య పరంగా చూస్తే ఎర్లీ స్టేజ్‌ స్టార్టప్‌లు ఏకంగా 60-62 శాతం నిధులను సొంతం చేసుకున్నాయి.

ఒక్కో ఒప్పందానికి సంబంధించి యావరేజ్‌ టికెట్‌ సైజ్‌ 4 మిలియన్‌ డాలర్లుగా నమోదైంది. 2022లో జరిగిన ఒప్పందాల విలువను పరిగణనలోకి తీసుకుంటే.. టోటల్‌ ఫండింగ్‌లో సుమారు 12 శాతాన్ని ఎర్లీ స్టేజ్‌ డీల్సే ఆక్రమించాయి. ఈ పర్సంటేజీ 2021లో దాదాపు 7 శాతం మాత్రమే కాగా అది కాస్తా 2022లో 5 శాతం పెరిగింది. మొత్తం డీల్స్‌ సంఖ్యలో.. లేట్‌ స్టేజ్‌ ఫండింగ్‌ డీల్స్‌ వాటా 38 శాతం మాత్రమే.

వ్యాల్యూ పరంగా పరిశీలిస్తే మాత్రం వీటి పర్సంటేజీ 88 కావటం చెప్పుకోదగ్గ అంశం. స్టార్టప్‌ ఫండింగ్‌ను నగరాల వారీగా గమనిస్తే.. 2022 డిసెంబర్‌లో.. బెంగళూరు, నేషనల్‌ క్యాపిటల్‌ రీజియన్‌ మరియు ముంబై.. ఈ 3 సిటీలే ఏకంగా 82 శాతం షేరును కలిగి ఉన్నాయి. టాప్‌-3 సిటీల్లోని 28 శాతం స్టార్టప్‌లు 20 మిలియన్‌ డాలర్ల అదనపు నిధులను సమీకరించాయి.

యూనికార్న్‌ల విషయంలో బెంగళూరు అగ్ర స్థానాన్ని ఆక్రమించింది. ఆ తర్వాత ర్యాంకులు నేషనల్‌ క్యాపిటల్‌ రీజియన్‌ మరియు ముంబై నగరాలు పొందాయి. ఫండ్‌ రైజ్‌కి సంబంధించి ఇతర కంపెనీల్లోనూ ఇదే ట్రెండ్‌ కొనసాగింది. 50 నుంచి 100 మిలియన్‌ డాలర్ల వరకు నిధులు ఇదే రీతిలో సమీకరణ జరిగాయి.

Show comments